కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా. కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్ లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ను కేంద్రం చేపట్టింది. ఈ భవనంలో 900 నుంచి 1,200 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చునేందుకు వీలుగా త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022 ఆగస్టు 15) నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
అయితే , ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు బయటకి వచ్చినప్పటి నుండి దీనికి ఎదో ఒక విదంగా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం సెంట్రల్ విస్టా పనులు ఆపే ప్రసక్తే లేదు అని , పనులని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే .. సెంట్రల్ విస్టా పై తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు , ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్రస్తావిస్తూ, పనులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్కడా లేదని స్పష్టం చేసింది.. మొత్తంగా ఆ పిటిషన్‌ను తిరస్కరించింది హైకోర్టు.