పది మందిని కాదు.. వంద మందిని తెచ్చుకో.. అంటూ భారీ సినిమా డైలాగులు ఇప్పటికే విని ఉంటాం. సినిమా ముచ్చటను పక్కన పెడితే.. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీ బుల్లెట్ ట్రైన్ల ప్లాన్ ను తెర మీదకు తెచ్చింది. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబయి కారిడార్ లో బుల్లెట్ ట్రైన్ నడిచేలా హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణం షురూ అయ్యింది.
దేశానికి బుల్లెట్ ట్రైన్ల అవసరం ఉందా? అన్న ప్రశ్నతో పాటు.. ట్రైన్లు చాలక ఓపక్క జనాలు ఇబ్బంది పడుతుంటే.. ఆ విషయాన్ని వదిలేసి.. సామాన్యులు.. మధ్య తరగతివారు భరించలేనంత టికెట్ల ధరలు ఉండే బుల్లెట్ ట్రైన్ల కంటే.. మామూలు రైళ్లను పెద్ద ఎత్తున పట్టాలెక్కించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
అయితే.. అలాంటి డిమాండ్లను పెద్దగా పట్టించుకోనట్లుగా ఉండే కేంద్ర సర్కారు..బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని పది ప్రధాన మార్గాల్లో బుల్లెట్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు వీలుగా మోడీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిర్మిస్తున్న రూట్ కాకుండా మరో పది రూట్లలోబుల్లెట్ రైళ్లను పరుగులు తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన రైల్వేశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేయటం.. దాన్ని కేంద్ర కేబినెట్ అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ నేపథ్యంలో దేశంలో పది రూట్లలో బుల్లెట్ ట్రైన్లను నడిపేందుకు వీలుగా అధ్యయనం మొదలైందని చెప్పక తప్పదు.
ఇందుకోసం రానున్న పదేళ్లలో దాదాపు రూ.10లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని భావిస్తున్నారు. ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్.. జైకా.. ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంతో దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే.. మోడీ సర్కారు కొత్తగా ప్లాన్ చేస్తున్న పది బుల్లెట్ ట్రైన్ రూట్లలో తెలుగు ప్రాంతానికి చెందినది ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం. ప్రతి విషయంలో తెలుగు ప్రాంతాలకు ఏదోలా దెబ్బ కొట్టేలా మోడీ తీరు ఉంటుందన్న విమర్శలకు తగ్గట్లే.. బుల్లెట్ ట్రైన్ల విషయంలోనూ అదే తీరును ప్రదర్శించటం విశేషం. తాజాగా ప్రతిపాదించిన రూట్లలో అత్యధికం ఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి. మహరాష్ట్ర.. గుజరాత్.. మధ్యప్రదేశ్ లకు ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరాదికి ఎనిమిది బుల్లెట్ ట్రైన్లు కేటాయిస్తే.. దక్షిణాదిన తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలకు రెండు రూట్లను ప్రతిపాదించారు.
కొత్తగా ప్రతిపాదనలోకి తెచ్చిన రూట్లను చూస్తే.. '
1. ఢిల్లీ -ముంబయి
2. ఢిల్లీ - కోల్‌కతా
3. ఢిల్లీ- వారణాసి
4. ఢిల్లీ - భోపాల్
5. ఢిల్లీ - అమృతసర్
6. ఢిల్లీ - అహ్మదాబాద్
7. నాగపూర్ - ముంబయి
8. పాట్నా- కోల్‌కతా
9. చెన్నై- బెంగళూరు
10. చెన్నై- మైసూర్