అలా రోడ్డును దాటి హైవేల మీదకు ఎక్కిన కాసేపటికే టోల్ వాయింపు కొత్తేం కాదు. అయితే.. ఈ టోలు తీతలో ఎప్పటికప్పుడు వాతలే తప్పించి వరాలు కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పుణ్యమా అని సరికొత్త సంస్కరణల దిశగా పరుగులు తీస్తోంది ఆ శాఖ.
తాజాగా టోలు వసూలు విషయంపై కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియను మరింత సరళతరం చేయటం.. ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ఉండేలా కొత్త నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం.
తాజాగా తీసుకొస్తున్న కొత్త విధానంతో వాహనదారులకు కొంతమేర ఉపశమనం కలిగే వీలుందని చెప్పాలి. ఇప్పటివరకు అమలు చేసిన విధానం మాదిరి కాకుండా.. హైవేల మీద వాహన పరిణామం.. వాహనం తిరిగిన దూరాన్ని ఆధారంగా చేసుకొని టోల్ వసూలు చేసే కొత్త విధానం అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.
వాహనం సైజు.. రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆదారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ కొత్త టోల్ విధానంలో జాతీయ రహదారులపై వాహనం ఎంత సమయం.. ఎంత దూరంగా ప్రాయణించిందన్న ఆధారంగా టోల్ వసూలు చేయటం ద్వారా.. వాహనదారులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.
ఈ మధ్యనే టోల్ ప్లాజా వసూళ్ల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రతి 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయరని చెప్పిన వైనం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా చేసిన ప్రకటనతో టోల్ భారాన్ని మరింత తగ్గించే విషయంలో కేంద్రం మరింత పట్టుదలతో ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా కొత్త విధానం ఇప్పుడు తీసే టోలు కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.