బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు దేశంలో వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మొదట బ్రిటన్ దేశానికి రాకపోకలు బంద్ చేసిన బీజేపీ ప్రభుత్వం తాజాగా జనవరి 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో విమానాలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే బ్రిటన్ విమానాలపై కేంద్రం డిసెంబర్ 31వరకు నిషేధం విధించింది. దాన్ని ఇప్పుడు మొత్తం అన్ని దేశాలకు పొడిగించి జనవరి 31కి మార్చారు.
బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన భారతీయుల్లో పలువురికి కొత్త కరోనా సోకడం.. పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి కొత్త కరోనా సోకినట్టు తేలింది.
ఈ వైరస్ ఎంతో డేంజర్ గా ఉండడం.. వేగంగా విస్తరించి ప్రాణాలు తీస్తుండడంతో కేసుల సంఖ్య పెరిగితే ప్రమాదం అని తెలిసి కేంద్రం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఇక అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఉండవు. విదేశాల్లో ఉన్న భారతీయులు ఇక్కడికి రావడానికి పోవడానికి కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.