ఒక్కరాత్రి.. ఒకే ఒక్క రాత్రి కురిసిన వర్షానికి బెంగళూరు మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు జలాశయాలు అయితే.. కాలనీలు చెరువులుగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు.. ఇటీవల కాలంలో ఎప్పుడూ విననట్లుగా.. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లోకి వర్షపునీరు పోటెత్తటంతో కంపెనీలు మూసి ఇంటి నుంచిపని చేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం కురిసి రెండురోజులు గడిచిన తర్వాత కూడా దాని తాలుకూ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి. అది కూడా ఏ లోతట్టు ప్రాంతాల్లోని వారో.. మరే దిగువ మధ్యతరగతి కుటుంబాల వారో నివసించే ప్రాంతాల్లో ఉండేవారు కాదు.
అత్యంత సంపన్నులు.. కంపెనీ సీఈవోలు.. సీవోవోలు నివాసం ఉండే ప్రాంతాల్లో నిలిచిన నీరు.. బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉండటంతో.. వారిని ట్రాక్టర్లలో బయటకు తరలించిన వైనం షాకింగ్ గా మారింది. ఇంకొందరిని అయితే..
జేసీబీల్లోనూ బయటకు తీసుకురావాల్సి వచ్చింది. రూ.30 కోట్ల ఖరీదైన విల్లా.. వర్షపు నీటిలో చిక్కుకొని ఉన్న పరిస్థితి చూస్తే.. ఇలాంటిది ఒకటి.. రెండు ఇళ్లు కావు వందలాదిగా ఉన్న పరిస్థితిని చూస్తే.. గార్డెన్ సిటీలో ఇన్ని ఘోరాలా? అన్న భావన కలుగక మానదు.
వర్షం కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బంది గురించి ఒక సీఈవో పెట్టిన పోస్టు పరిస్థితి తీవ్రతను ఇట్టే తెలియజేస్తుంది. 'నీట మునిగిన మా సొసైటీ నుంచి ఒక కుటుంబం.. మా కుక్కను ట్రాక్టర్ లో తరలించారు. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సాయం కావాలంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి. సాధ్యమైన సహాయం చేసేందుకు ప్రయత్నిస్తా' అంటూ అన్ అకాడమీ డైరెక్టర్ గౌరవ్ ముంజాల్ ట్రాక్టర్ లో తరలిస్తున్న వీడియోను షేర్ చేశారు.
అప్ గ్రేడ్ సీఈవో ట్రాక్టర్ ఎక్కి ఆఫీసుకు వెళ్లిన వీడియో క్లిప్ బయటకు వచ్చాయి. భారీగా కురిసిన వర్షాలతో తాను ఉండే ఇంటి ప్రాంతంలో కరెంటు లేకపోవటంతో.. వర్కు కోసం ఆఫీసుకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. బెళ్లందూర్.. షార్జాపురా రోడ్డు.. అవుట్ రింగ్ రోడ్డు.. బీఈఎంఎల్ లే అవుట్ తదితర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఇదిలా ఉంటే.. రక్షిత శివరాం అనే కాంగ్రెస్ నేత ఒక వీడియోను షేర్ చేశారు.
అందులో ఖరీదైన బంగ్లాలు.. అత్యంత లగ్జరీ కార్లు వర్షపు నీటిలో మునిగిన వైనాన్ని తెలిపేలా వీడియో ఉంది. రూ.30 కోట్ల విల్లాలు వర్షపు నీటిలో చిక్కుకున్న వైనం అంటూ వీడియోను షేర్ చేశారు. సంపన్నులుగా పేరున్న ఎంతో మంది వర్షం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాధారణ పౌరుల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన వైనం బ్రాండ్ బెంగళూరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View