కొద్ది రోజులుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు టీవీ9 - టీవీ5 లపై జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ - ఆయన అనుచరుల పై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిపై పవన్ - ఆయన అనుచరులు - అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మీడియాపై పవన్ బెదిరింపు ధోరణి సరికాదని, మిగిలిన మీడియా సంస్థలు జర్నలిస్టులు కూడా తమతో కలిసిరావాలని కోరింది. తమ సంస్థ లోగోలు కొందరు దుర్వినియోగం చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించింది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇండస్ట్రీ మద్దతు తెలపడం లేదని....ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు సినీ పెద్దలు ...ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటిచించారు. అయితే, టాలీవుడ్ నటీనటులు - సినీ పెద్దలపై ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో టాలీవుడ్ నటీనటులు పాల్గొనకపోవడం సరికాదన్నారు. అంతేకాదు, టాలీవుడ్ కు త్వరలోనే అల్టిమేటం ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకోసం తెలంగాణ నాయకులు మద్దతు తెలుపుతున్నా కూడా తెలుగు సినీ పరిశ్రమ అంటీ ముట్టనట్లు వ్యవహరించడం క్షమార్హం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో తెలంగాణకు చెందిన సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారని - ప్రిన్స్ మహేష్ బాబు పాల్గొనలేదని అన్నారు.