హెడింగ్ చూసి షాకవ్వకండి. నిజంగా నిజమే. హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ అధికారులు ఓ కారు యజమానికి ఆన్‌లైన్ ఛలానా పంపారు. అది కూడా ఇటీవలి కాలంలో చలానాలతో చావదొబ్బుతున్నారని ప్రచారం జరుగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులే! ఇదేం విడ్డూరం. బైకుపై వెళ్లేవారికి అంటే హెల్మెట్ లేకపోతే చలానాలో అర్థం ఉంది కానీ కారులో వెళ్లేవాళ్లకు హెల్మెట్ ఏంటి అని అనుకోకండి. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉండే కె.రామలింగానికి మారుతీ ఆల్టో (టీఎస్08యూఏ 7094 ) ఉంది. బాలానగర్‌లో ఈ నెల 4న హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో ఛలానా పంపారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో చూపించారు. దీంతో ఖంగుతిన్న సదరు కారు యజమాని కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఛలానా పంపడమేమిటా అని ఆరా తీశాడు. తన కారు నెంబర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి యాక్టివాకు పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని తెలుసుకుని విస్తుపోయాడు. తన కారు నెంబర్‌ను ఓ వ్యక్తి యాక్టివా వాహనానికి పెట్టుకుని దర్జానా తిరుగుతున్నాడని తెలుసుకొని...ఆయన వల్ల ఫెనాల్టీ ఛలానాల తన ఖాతాలోకి చేరడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. తన కారు నెంబర్‌ను ద్విచక్రవాహనానికి పెట్టుకుని నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు పంపిన ఛలానాను ఉపసంహరించుకోవాలని ఆయన ట్రాఫిక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.