మే 12న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ముగిసి హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీజేపీల మధ్య ఓవైపు ఎత్తుగడలు సాగుతూనే మరోవైపు సీఎం పీఠంపై కసరత్తు కూడా జరుగుతోందని అంచనాలు వెలువడుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ గాలి జనార్ధన్ రెడ్డి చక్రం మళ్లీ తిప్పుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ - కాంగ్రెస్ మరోవైపు జేడీఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా గాలి బ్రదర్ ఇప్పుడు కన్నడ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ దూకుడును చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్...కన్నడ పీఠంపై గాలి అనుచరుడికి కూర్చోబెట్టే సంచలన నిర్ణయం బీజేపీ తీసుకోనుందని విశ్లేషించారు.
బాగలకోట జిల్లా బాదామి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిసైడవగా...బాదామిలో తమ అభ్యర్థి ఎవరో చివరి క్షణం వరకు సస్పెన్స్‌లో ఉంచిన బీజేపీ… చివరి క్షణంలో బి. శ్రీరాములు పేరు వెల్లడించింది.బాదామిలో మొదట్నుంచి కుల రాజకీయాలకే ప్రాధాన్యం. అభ్యర్థి కులాన్ని బట్టి ఓట్లు వెయ్యడం ఇక్కడ సర్వసాధారణమని చరిత్ర చెబుతోంది. కురబ సామాజిక వర్గం ఇక్కడ అత్యంత కీలకం. మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కురబలు 55 వేలు వరకు ఉన్నారు. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్య అందుకే బాదామిని సురక్షితంగా భావించి పోటీలోకి దిగారు. బాదామిలో ఎస్టీలు కూడా అత్యధికంగా 36 వేల మంది వరకు ఉండడంతో బీజేపీ వాల్మీకి నాయక (ఎస్టీ) వర్గానికి చెందిన శ్రీరాముల్ని పోటీకి దించింది. దీంతో అందరి చూపు బాదామి నియోజకవర్గంపై పడింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే సీఎంను ఓడించిన వ్యక్తిగా గుర్తిస్తూ యడ్యురప్ప బదులుగా శ్రీరాములుకు కుర్చీ కట్టబెట్టనుంది.
మరోవైపు ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి తన సత్తాను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీరాములు కోసం హనగల్ లోని ఆయన తాత్కాలిక నివాసానికి బీజేపీ జెండాలు ధరించిన కార్యకర్తలు ప్రతీ రోజూ కనీసం 4,000 నుంచి 5,000 వరకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా శ్రీరాములును గెలిపించాలంటూ మొలకమూల గ్రామాల్లో గాలి జనార్ధన్ రెడ్డి ప్రచారం కూడా చేశారు. శ్రీరాములు తన సన్నిహితుడని తన స్నేహితుడి కోసం ఓటు వేయాలని కానీ పార్టీకి కాదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్ల వయసు దాటిన నేతలెవరూ కీలక పదవుల్లో ఉండకూడదు అనే లెక్కలతో మోడీ సాగుతున్నాడు. యడ్యూరప్పకు ఇప్పటికే 75సంవత్సరాల వయసు నిండింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే గాలి సత్తాను చాటుకునేందుకు తన అనుచరులు పది మందికి టికెట్లు ఇపించుకోవడంతో పాటు రెండు మూడు జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమీకరణాలు కూడా శ్రీరాములుకు ప్లస్ అవుతాయని, బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సే వస్తే, అయితే డిప్యూటీ సీఎం - కాలం కలిసి వస్తే శ్రీరాములు సీఎం అయ్యే అవకాశలు లేకపోలేదని ఆ జర్నలిస్ట్ విశ్లేషించారు. అయితే వాస్తవంగా గాలి అనుచరుడికి పదవి దక్కుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు.