సంద‌డి లేకుండా చిన్న‌బోయిన 108వ కేబినెట్ మీటింగ్!

Update: 2019-05-15 05:39 GMT
చివ‌రి వ‌ర‌కూ ఉత్కంట‌.. అనుమ‌తి కోసం ఎదురుచూపులు.. ఈగోను సంతృప్తిప‌ర్చుకోవ‌టానికి త‌ప్పించి.. ఏజెండా పెద్ద‌గా లేని కేబినెట్ మీటింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ.. ప్లాప్ షోను త‌ల‌పించేలా మంత్రివ‌ర్గ స‌మావేశం సాగిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా ముగిసిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం త‌మ్ముళ్ల‌లో నెల‌కొన్న నైరాశ్యాన్ని.. ఓట‌మికి ముందే ప్రిపేర్ అయిన‌ట్లుగా వారి తీరు ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

బాబు ప్ర‌భుత్వం ఏపీలో కొలువు తీరిన త‌ర్వాత మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ 108వ స‌మావేశంగా చెప్పాలి. ఈ ఒక్క స‌మావేశాన్ని మిన‌హాయిస్తే.. మిగిలిన‌ 107 స‌మావేశాలు ఒక ఎత్తు కాగా.. నిన్న‌టి స‌మావేశం మ‌రో ఎత్తుగా చెప్ప‌క త‌ప్ప‌దు. కేబినెట్ మీటింగ్ అన్నంత‌నే మంత్రులు.. వారి వ్య‌క్తిగ‌త సిబ్బంది.. ప్ర‌భుత్వ ఉద్యోగుల హ‌డావుడి.. జిల్లాల నుంచి భారీగా త‌ర‌లి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌తో స‌చివాల‌యం క‌ళ‌క‌ళ‌లాడిపోయేది.

ఈసారి అందుకు భిన్నంగా చ‌డీ చ‌ప్పుడు లేన‌ట్లుగా కేబినెట్ భేటీ సాగ‌టం గ‌మ‌నార్హం. కోడ్ అమ‌లులో ఉండ‌టంతో పాటు.. గెలుపు ధీమా లేక‌పోవ‌టంతో చోటా నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు హ‌డావుడి అస్స‌లు క‌నిపించ‌లేదంటున్నారు. పాల‌నా ప‌రంగా ప‌రిమిత అధికారులు ఉన్న బాబు స‌ర్కారు చేసేదేమీ లేక‌పోవ‌టంతో ఎప్ప‌టిలా.. ఈసారి కోలాహ‌లం క‌నిపించ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. ఏది ఏమైనా కేబినెట్ భేటీ త‌ప్ప‌క నిర్వ‌హించాల‌ని మొండిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించిన చంద్ర‌బాబు.. కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన సాధించిందేమీ లేద‌ని.. అట్ట‌ర్ ప్లాప్ షో అన్న మాట త‌ప్పించ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 
Tags:    

Similar News