సుదీర్ఘ రాజకీయ అనుభవం.. పలుమార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక పార్టీ అధినేత.. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదురైన సవాళ్ల నేపథ్యంలో నడి రోడ్డు మీద కూర్చొని బైఠాయించాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ అనుకొని ఉండకపోవచ్చు. టీడీపీకి.. చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరుగుతుందని కానీ.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల కారణంగా గాయాలపాలు అవుతామని కానీ ఊహించకపోవచ్చు.
ఊహకు.. అంచనాలకు అందని రీతిలో రియాక్టు కావటంలో వైసీపీకి మించినోళ్లు మరెవరు ఉంటారన్న వాదనకు తగ్గట్లే ఈ రోజు కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలుఉన్నాయని చెప్పాలి. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ భవనాన్ని ధ్వంసం చేయటంతో పాటు.. టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు.. జెండాల్ని చించివేయటం.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయటంలాంటి పరిణామాలతో కలత చెందిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నడి రోడ్డు మీదనే బైఠాయించారు. కొంతసేపు నడి రోడ్డు మీదనే కూర్చున్న ఆయన తర్వాత పార్టీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు.. కార్యకర్తలతో పాటు పోలీసులకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన పోలీసుల్ని దోషులుగా నిలబెడతామని.. కుప్పం ప్రజలు ఎప్పుడూ ప్రశాంత జీవితాన్ని గడిపిన వైనాన్ని వెల్లడించారు. కుప్పం ప్రజలు ఎప్పుడూ కూడా ఈ తరహా దాడుల్ని చూడలేదని.. పోలీసుల కంటే కూడా బ్రిటీష్ వాళ్లే నయమని పేర్కొన్నారు.
కుప్పం చరిత్రలోనే ఇవాళ చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇన్ని ఆటంకాల్ని క్రియేట్ చేస్తారా? ఒక పార్టీ అధినేతను.. మాజీ ముఖ్యమంత్రిని అన్నది కూడా ఆలోచించకకుండా ఇలా తనపై దాడికి దిగుతారా? అని ప్రశ్నించారు. అసలు ఇంత గొడవ జరుగుతున్నా.. మిస్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నావ్? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని వైసీపీ సర్కారు కంకణం కట్టుకుందన్న చంద్రబాబు.. కుప్పంలో ఈవాళ చోటు చేసుకున్న పరిణామాలు ఇంతకు ముందెప్పుడైనా చూశారా? అని ప్రజల్ని ప్రశ్నించారు.
తాను బతికి ఉన్నంత వరకు కుప్పంలో ఎవరూ ఏమీ చేయలేరని ఛాలెంజ్ చేసిన చంద్రబాబు.. ‘ఈ చోటా మోటాలు కాదు నేరుగా జగన్ మోహన్ రెడ్డి రావాలి. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసి రాక్షస ఆనందాన్ని పొందుతారా?’ అని మండిపడ్డారు. తమ కార్యక్రమాలకు వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేకనే.. ఇలా విధ్వంసానికి దిగుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు.. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చెప్పిన ఆయన.. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకనే వైసీపీఈ తరహా దాడులకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. రామకుప్పం మండలంలో జరిగిన తన మీటింగ్ వద్దనే వైసీపీ వాళ్లు ఎలా జెండాలు ఎగురవేస్తారన్న ఆయన.. కుప్పం పట్టణంలో వైసీపీ గూండాలకు వత్తాసు పలకొద్దని పోలీసుల్ని కోరారు. రౌడీలు.. గూండాల్ని అణిచివేసిన పార్టీ టీడీపీ అని చెప్పిన చంద్రబాబు.. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు.