నీతుల ఎదుటివారికి చెప్పటానికే కాని పాటించడానికి పనికిరావు. తాను చేస్తే రాజకీయం... ఎదుటివారు చేస్తే కుటిల రాజకీయం. ఈ ధోరణి తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలో కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి చాల ఉన్నత విలువలు ఉన్నాయని, దేశంలోనే చాల క్రమశిక్షణ కల పార్టీగా అభివర్ణించుకుంటారు బాబు. అయితే రాజాంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించింది.
మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్ ఆర్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన సస్పెండ్ అయినా కొద్ది గంటలకే అమరావతి అశాంబ్లీలోని ఆయన చాంబర్ ను ఎవరో ధ్వంశం చేసారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఇంకా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరలేదు కనుక ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రవికుమార్, మరో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి చాంబర్ లోకి వెళ్లి అక్కడకొన్ని ఫైల్స్ ను ధ్వంశం చేసారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఏ ఫైల్స్ ను ధ్వంసం చేసారన్నది స్పష్టత రాలేదని వారు అన్నారు.
అయితే ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టే ఎవరికీ కూడా తెలుగుదేశం పార్టీలో చోటు లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీలో మేడా పదవులు అనుభవించారని, తన హయాంలో ఎమ్మెల్యేగాను, ప్రభుత్వ విప్ గా పదవులు అనుభవించి చివరి నిమిషంలో పార్టీ మారుతున్నారని బాబు ఆరోపించారు. మేడా తండ్రి టిటిడి బోర్డు మెంబరుగా కూడా పదవులు అనుభవించారని నాయుడు ఆరోపించారు. ఎదుటివారికి చెప్పేందుకేనా నీతులు బాబు... అంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. 2014లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమయ్యాయి ఈ నీతుల అని వారు ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడు కూడా మేడా చాంబర్ ను ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు, మరో ప్రభుత్వ విప్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారో చెప్పవల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
Full View