అదేంటో దేశమంతా మోడీకి వ్యతిరేకంగా ఉంది. మోడీ గ్రాఫ్ దిగజారిపోయింది అని ఈ మధ్యనే ఒక జాతీయ మ్యాగజైన్ సర్వే నివేదిక చెప్పేసింది. అంతే కాదు అనేక సర్వేలు కూడా అదే నిజం అంటున్నాయి. మరో వైపు దేశంలో మోడీ వ్యతిరేక కూటమి గట్టిగా తయారవుతోంది. కానీ ఏపీలో మాత్రం సీన్ వేరేగా ఉంది. టీడీపీ జాతీయ అధ్యక్షుణ్ని అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేంద్రంలో పలు మార్లు చక్రాలు తిప్పి ప్రధానులను రాష్ట్రపతులను చేశానని ఆర్భాటం చేసే చంద్రబాబు మాత్రం అసలు కిమ్మనడంలేదు. ఆయన మోడీ, బీజేపీ ఈ రెండు పదాలు మరచిపోయి చాలా కాలమే అయింది అని సెటైర్లు కూడా పడుతున్నా పెదవి విప్పడంలేదు.
పోనీ చంద్రబాబు టీడీపీకి కర్త, కర్మ, క్రియ. ఆయన రాజకీయం ఆయనకు ఉంటుంది. 2024 ఎన్నికలు చావో రేవో కాబట్టి ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి అనుకున్నా కూడా అసలు తమ్ముళ్ళకు ఏమైంది. ప్రజా సమస్యల మీద పోరాటం అని తెగ ఉత్సాహపడుతున్న తమ్ముళ్ళు కేంద్రం మోడీ అన్న మాటలను మరచిపోయి ఎంత సేపూ జగన్ మీదనే బాణాలు వేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు ఎవరు కారకులు అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.
కేంద్రంలోని మోడీ గత ఏడాది కాలంగా ఇంధన ధరలను పెంచుకుంటూనే పోతున్నారు తప్ప ఎక్కడా తగ్గించిన పాపాన పోవడంలేదు. పెట్రోల్ బంక్ కి వెళ్లే ప్రతీ వాహదారూ కేంద్ర ప్రభుత్వం మీదనే తన గుస్సాను ప్రదర్శిస్తాడు. మరి ఇంత చిన్న విషయం తెలిసి కూడా లాజిక్ మిస్ అయినట్లుగా జగనే పెట్రోల్ ధరల పెంపునకు జగనే కారణం అంటూ టీడీపీ తమ్ముళ్ళు వీధులల్లోకి వచ్చి యాగీ చేస్తే జనం నమ్ముతారా. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం తీసుకున్నా అలాగే ఉంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్రం పట్టుదల మీద ఉంది. పదే పదే అదే చెబుతోంది కూడా.
ఇక స్టీల్ ప్లాంట్ మాది అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిండు పార్లమెంట్ లో ఏనాడో ప్రకటించారు. అలాంటి ప్లాంట్ ని ప్రైవేటీకరించడం పైన మండి పడాల్సింది ఎవరి మీద. బీజేపీ మీద, మోడీ మీద. కానీ చంద్రబాబు నుంచి తమ్ముళ్ళ వరకూ జగనే ప్రైవేటీకరిస్తున్నాడు అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి సరిపోని కధలను కూడా చెబుతున్నారు. ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే జగన్ వచ్చే లాభమేంటి, ఆయన విశాఖకు రాజధాని మార్చాలనుకుంటున్నారు.
అలాంటపుడు నంబర్ వన్ పరిశ్రమగా ఉన్న ప్లాంట్ ఉంటేనే కదా మంచిది. సగటు జనాలు ఇదే ఆలోచిస్తారు. కానీ టీడీపీ తమ్ముళ్ళు మాత్రం ఈ బురదను జగన్ కి రాయాలనుకుంటోంది. సరే జగన్ని ఎటూ విమర్సించవచ్చు. కానీ అసలు ముద్దాయి బీజేపీని వదిలేసి విమర్శిస్తే రాజకీయం పండుతుందా అన్నదే వారు ఆలోచించుకోవడంలేదు అంటున్నారు. మొత్తానికి చూస్తే మోడీని విమర్శించే దమ్ము లేదు తమ్ముళ్లకు అన్నదే జనం మాటగా ఉంది మరి.