నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా ''అన్ స్టాపబుల్ విత్ NBK'' అనే టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ టాక్ షో.. సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింత గ్రాండ్ గా 'అన్ స్టాపబుల్' సీజన్-2 తో వచ్చారు నిర్వాహకులు. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ షో.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
రెండో సీజన్ లో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా బాలయ్య బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ఆయన తనయుడు నారా లోకేష్ వచ్చారు. ఇప్పటి వరకూ మొదటి సీజన్ లో ఎంటర్టైన్మెంట్ అందించడానికి సినిమా సెలబ్రిటీలే గెస్టులుగా వచ్చారు. అయితే ఈసారి మాత్రం సీజన్-2 ని పొలిటికల్ లీడర్స్ తోనే లాంచ్ చేయడంతో అందరూ ఆసక్తి కనబరిచారు.
'అన్ స్టాపబుల్ విత్ NBK' మొదటి సీజన్ ని గుర్తు చేస్తూ సీజన్-2 ప్రారంభమైంది. బాలయ్య తన బావ చంద్రబాబు నాయుడిని గ్రాండ్ గా ఆహ్వానించారు. చంద్రబాబు రాజకీయ జీవితం - ఎన్టీఆర్ తో పరిచయం - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి వంటి అంశాలను ఈ ఎపిసోడ్ లో ప్రస్తావించారు. అలానే ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపైనా చంద్రబాబు ఈ షోలో మాట్లాడారు.
''హైదరాబాద్ కి ఐటీ నేను తీసుకొస్తే అందరూ నన్ను ఎగతాళి చేసారు.. టెలిఫోన్ అన్నం పెడుతుందా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయింది. నేను విజన్ అన్నప్పుడు అందరూ నన్ను 420 అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఎక్కడికో వెళ్లిపోయింది. నాకు ఎన్టీఆర్ స్ఫూర్తి'' అని చంద్రబాబు అన్నారు.
''ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి పేరు మార్చడం చాలా దురదృష్టకరం. ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకపోయినా అలాంటి తప్పుడు పనులు చేయడం రాజకీయాల్లో హుందాతనం కాదు. ఇది రెండుసార్లు జరిగింది. శంషాబాద్ కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది.. ల్యాండ్ కేటాయించింది నేనే. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు.. డొమెస్టిక్ కి ఎన్టీఆర్ పేరు పెట్టా. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండిటికీ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు''
''హెల్త్ యూనివర్సిటీ - మహిళా యూనివర్సిటీ - ఓపెన్ యూనివర్సిటీ ఎన్టీఆర్ తోనే వచ్చాయి. భారతదేశంలో ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కింది. ఎన్టీఆర్ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి.. క్రియేటివిటీలో అందరి కంటే ముందుంటారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాం. ఇప్పటి వరకూ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు పేరు మార్చారు. ఇది చాలా దారుణం. ఇది మంచి సాంప్రదాయం కాదు''
''కొంతమంది పేర్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొత్తగా డెవలప్ చేసి పెట్టుకుంటే మంచిదే. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెలుగు వారి గురించి ఆలోచిస్తే ఎన్టీఆర్ గుర్తొచ్చే విధంగా ఉంటారు. అలాంటి నాయకుడి పేరు మార్చడం అనేది తెలుగు వారిని.. తెలుగు జాతిని అవమానించినట్లే. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్సార్ కడప జిల్లా - వైఎస్సాఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మార్చడం ఒక్క నిమిషం పని నాకు. కానీ నేను అలా చేయలేదు. అదీ నా సంస్కారం. మళ్ళీ ఒకటిన్న సంవత్సరం తర్వాత తప్పకుండా ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడతాం. అది నా ఒక్కడి కోరిక కాదు.. తెలుగు జాతి కోరిక'' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.