తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలకు ఇక నాలుగు రోజులే సమయం ఉంది. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ రానునున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పండుగ ముందస్తు సన్నాహకాలు మొదలైపోయాయి. పిండి వంటలు, నూతన వస్త్రాల కొనుగోళ్లలో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన సంక్రాంతి సంబరాలను తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జరుపుకోనున్నారు.
ఈ పండుగ కోసం చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు నారావారి పల్లెకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు బంధువులు నారావారి పల్లెలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు నారావారి పల్లెకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈసారి నారావారి పల్లెకు వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. కాగా గతంలో పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు నారావారి పల్లెలో సందడి చేశాయి.
చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు తమ బంధువులు, సన్నిహితులతో కలిసి పండుగను జరుపుకుంటారని చెబుతున్నారు. ఇందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా వీర సింహారెడ్డి చిత్రం వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అలాగే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాత్రను చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ, సతీమణి బ్రాహ్మణి, ఇతర బందువులతో గడిపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అలాగే వారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్రను మొదలుపెట్టాలనే యోచనతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.