ఏపీ సీఎం జగన్‌ను బద్నాం చేయాలనే ప్లాన్ అమలు చేస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు కనిపించేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చంద్రబాబు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కూడా ఒక వ్యతిరేక ప్రచారం తీసుకువచ్చారు. మేఘమథనం.. ఆరోగ్య శ్రీ.. వంటి కార్యక్రమాల ద్వారా ప్రజాధనాన్ని దోచేస్తున్నారంటూ.. ఆయన ప్రజల్లోకి వెళ్లారు. అదే సమయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. కానీ, అప్పట్లో వైఎస్‌పై ఉన్న అభిమానం చేతో.. లేక, కాంగ్రెస్ పై ఉన్న నమ్మకంతోనే దీనికి ఓ వర్గం మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదు.
అదే సమయంలో వైఎస్ కేవలం రాజకీయంగానే అన్ని విషయాలను చూశారు కనుక.. వ్యక్తిగతంగా ఏ ఒక్క నేతకు ఇబ్బంది కలగలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం అప్పట్లో సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు.. తన ప్లాన్‌ను మళ్లీ బయటకు తెచ్చారు. జగన్‌పై వ్యతిరేక ప్రచారంతోపాటు.. ప్రభుత్వం దివాలా తీస్తోందని.. ఆర్థిక పరమైన మేనేజ్ మెంట్ తెలియదని.. ఒక అసమర్ధుడికి ప్రజలు పట్టం కట్టారని.. బాబు.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి బాబు అనుకూల మీడియా బాగానే ప్రచారం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. పైగా టీడీపీ నేతలపై జగన్ సర్కారు వ్యక్తిగత చర్యలకు దిగుతున్న దరిమిలా.. జగన్‌ను అదుపు చేయాలంటే.. ఆర్థిక పరమైన సంకట స్థితిని తీసుకురావాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారు.
దీంతో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును రంగంలోకి దింపి లెక్కలతో సహా జగన్ సర్కారుపై విమ ర్శలు గుప్పించారు. రాష్ట్రం దివాలా తీస్తోందని, ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని.. అనుకూల మీడియాలో కథనాలు రాయించారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో సహజంగానే జగన్ ప్రభుత్వంపై చర్చ సాగుతోంది. ఇది ఒక రకంగా.. చంద్రబాబు సక్సెస్ అయ్యారనే సంకేతాలు ఇస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఎంతగా బద్నాం చేస్తే.. అంతగా చంద్రబాబు సక్సెస్ అయినట్టే. అయితే.. ఇక్కడే మరో ప్రమాదం పొంచి ఉందని.. అంటున్నారు.
ప్రస్తుతం జగన్ సర్కారు తీవ్ర తర్జనభర్జనలో ఉంది. ఆర్థిక సమస్యలతో ఇప్పటికే అల్లాడుతున్న సర్కారుకు చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు తీవ్రంగానే ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వాన్నే రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. చంద్రబాబుకు తీవ్ర శరాఘాతం తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత.. ఎదురైన పరిణామాల నుంచి టీడీపీ ఇంకా కోలుకోలేదని, ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు వస్తే..చంద్రబాబు పుంజుకోవడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో చంద్రబాబు జగన్‌పై దూకుడు తగ్గిస్తే.. మేలని అంటున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.