వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలంతా కలసి పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అడ్డు అదుపు లేకుండా చేస్తున్న అప్పులతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.
టీడీపీ సభలకు వస్తున్న స్పందనకు భయపడే అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పలికేందుకు ఇంటికొకరు టీడీపీ జెండా పట్టుకుని రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం జగన్‌ను 'అప్పుల అప్పారావు' అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి 18 మంది ముఖ్యమంత్రులు 2019 నాటికి 3.62 లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడున్నరేళ్ళలోనే జగన్ 6.37 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నారని మండిపడ్డారు.
దేశంలోని అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు 310 కోట్ల రూపాయలైతే ఒక్క సీఎం జగన్ ఆదాయం మాత్రం 375 కోట్లు రూపాయలని ఓ సర్వేలో తేలిందని చంద్రబాబు ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో ఓటును 10వేలు, 20వేలు వరకు కొనుగోలు చేయటంతో పాటు నాయకులను కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 16లక్షల రేషన్ కార్డులను తొలగించటంతో పాటు మహిళా పోలీసులతో అడగరాని ప్రశ్నలు ఆడిగిస్తూ భార్యాభర్తల మధ్య అగ్గి రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.