భద్రతను కూడా పక్కన పెట్టి.. మానవత్వం చాటుకున్న చంద్రబాబు.. ఏం చేశారంటే..
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన తన స్థాయిని పక్కన పెట్టి.. తన భద్రతను కూడా పక్కన పెట్టి.. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు ప్రాణాలు కాపాడేందుకు.. ప్రయత్నించిన తీరు.. సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.నిజానికి చంద్రబాబు స్థాయిలో ఉన్న ఎవరైనా.. ఇలా చేస్తారా? అని అనిపించేలా.. చంద్రబాబు నాలుగు కాదు.. నలభై మెట్లు దిగి వచ్చి.. బాధితులను ఆదుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని తన కోసం కేటాయించిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించి ప్రాణ భిక్ష పెట్టే ప్రయత్నం చేశారు.
భద్రతా సిబ్బంది వద్దని వారించినా..ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు.. శుక్రవారం రాత్రి.. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అనంతరం.. ఆయన విశాఖ పట్నం బయలు దేశారు. అయితే.. చీపురుపల్లి మండలం పుర్రేయవలస జంక్షన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకుని అటువైపు వస్తున్న చంద్రబాబు దీనిని గమనించారు. తొలుత తన కాన్వాయ్ స్లో కావడంతో.. 'ఏం జరిగిందని' ఆరా తీశారు.
వాస్తవానికి తొలుత చంద్రబాబు.. పోలీసులు తనను అడ్డుకునేందుకు వాహనాలను అడ్డు పెట్టారని అనుకున్నారు. కానీ, కొద్ది సేపటికి.. ప్రమాదం జరిగిందని.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని తెలుసుకున్నారు. వెనువెంటనే ఆయన క్షణం కూడా ఆలోచించకుండా.. వాహనం దిగి క్షతగాత్రులకి సహాయక చర్యలు చేపట్టారు. తన కాన్యాయ్‌లోని అంబులెన్సులోనే గాయపడిన వారిని విజయనగరం తరలించారు.
చీపురుపల్లి మండలం పుర్రేయవలస జంక్షన్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వెళ్తూ, తమ ముందు వెళ్తున్న రిక్షాను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలై, రోడ్డుపై పడిపోయారు. అక్కడున్న వారు 108 వాహనానికి సమాచారం అందజేసినప్పటికీ, వాహనం రావడం ఆలస్యమయింది.
ఇంతలో ఆ మార్గంలో విశాఖఎయిర్ పోర్టుకు వెళ్తున్న చంద్రబాబు ఘటన స్థలంలో కాన్వాయ్ నుంచి కిందికి దిగి, క్షతగాత్రులను తన కాన్యాయ్‌లో ఉన్న అంబులెన్సు ద్వారా విజయనగరం తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సమయంలో చంద్రబాబుకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డు తగిలారు. కారు నుంచి బయటకు రావొద్దని.. సూచించారు. అయితే.. వారి సూచలను కూడా చంద్రబాబుసున్నితంగా తిరస్కరించి.. కారు దిగి.. ప్రమాద ప్రాంతానికి కాలినడకనే చేరుకుని.. గాయపడిన వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ప్రస్తుతం చంద్రబాబు చేసిన ఈ సాయానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.