రాష్టంలో బలపడేందుకు పావులు కదుపుతున్న బీజేపీ ముందుగా తెలుగుదేశంపార్టీని దెబ్బతీయటానికి తీవ్రప్రయత్నాలు చేస్తోంది. వైసీపీకన్నా ముందు తాము టీడీపీని దెబ్బకొట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలోనే మీడియాలో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే లైనులో అప్పటి నుండి బీజేపీ నేతలు ఎటువంటి సందర్భం వచ్చినా ముందుగా చంద్రబబునాయుడునే టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా రాజకీయాల్లోని ముగ్గురు నేతల గురించి వివరించమని పార్టీ ఇన్చార్జి సునీల్ ధియోదర్ ను అడిగారు. దానికి ఆయన జవాబిస్తు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిత్రునిగా వర్ణించారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ తమకు శతృవు అన్నారు. చివరగా చంద్రబాబు గురించి మాట్లాడుతూ జగన్ కన్నా చంద్రబాబే మూడురెట్లు ఎక్కువ శతృవంటు చెప్పటాన్ని అందరు ఆశ్చర్యపోయారు.
బీజేపీ లెక్కలో 151 సీట్లో అధికారంలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టడం ఇప్పట్లో జరిగే పనికాదు. 23 సీట్లతో అందులోను అంతఃకలహాలతో గొడవలు పడుతున్న టీడీపీని దెబ్బ తీయటం చాలా సులభం. కొందరు ఎంఎల్ఏలను, నేతలను తమ పార్టీలోకి లాగేసుకుంటే ముందు టీడీపీని దెబ్బ కొడితే తర్వాత వైసీపీ సంగతి చూడవచ్చనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి ఆ ప్లానులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.