ఒకసారి విఫలమైన ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు మరోసారి చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నం మళ్లీ బెడిసి కొడుతుందని ఆయనకు తెలుసు. తన ప్రతిపాదనను నమ్మి ఆదరించే వాళ్లు ఎవరూ ఉండరనే సంగతి ఆయనకు తెలుసు. అయితే.. రెండోసారి కూడా ఒకే ప్రయత్నాన్ని చేయడం ద్వారా లోపం తన వద్ద లేదని, అవతలి వాళ్లే సహకరించడం లేదని బురద చల్లడం తప్ప.. ఇందులో మరో మర్మం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే.. చంద్రబాబునాయుడు.. రెండోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతానికి అమరావతి నుంచి వస్తున్న వార్తలను బట్టి.. శనివారం అఖిలపక్షం రెండోభేటీ జరుగుతుంది. గతంలో ఓ భేటీ ఏర్పాటుచేసిన చంద్రబాబు.. అప్పట్లో ఉదయం పది గంటలకు భేటీ అయితే ముందురోజు రాత్రి 11 గంటలకు పార్టీలకు ఆహ్వానాలు పంపి అభాసు పాలయ్యారు. ఆ భేటీకి వైకాపా - జనసేన - భాజపాలు హాజరు కాలేదు. వచ్చిన వామపక్షాలు కూడా ప్రతిపాదనల్ని ఛీత్కరించుకుని వెళ్లిపోయాయి. ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టిన తర్వాత.. ఇప్పుడు రెండోసారి సేమ్ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు..! అయితే ఈసారి వ్యూహం కాస్త మార్చారు. ఒక్కో పార్టికి విడిగా మంత్రులను కేటాయించి.. వారిద్వారా సగౌరవంగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానించాలని నిర్ణయించారు.
అయితే తాము అఖిలపక్షం నిర్వహించినట్టే ఉండాలి.. అందరిని సమైక్యపరచి పోరాడడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉండాలి.. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం రాకూడదు అని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు.
ఎందుకంటే.. ఈ అఖిలపక్షాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో.. దాని నిర్దిష్టమైన ఎజెండా ఏమిటో ఆయన ఇప్పటిదాకా బయటపెట్టలేదు. ప్రత్యేకహోదా కోసం అనే ఒక పడికట్టు మాట వాడడం మినహా.. ఏం చేయడానికి అన్ని పార్టీలు కలిసి రావాలో ఆయన పేర్కొనడం లేదు. ఆ మాటకొస్తే.. గతంలో సమావేశం నిర్వహించి.. నల్లరిబ్బన్లు ధరించడం వంటి పోరాట ప్రణాళిక ప్రకటించేసరికి.. వామపక్ష పార్టీలే చీత్కరించుకుని వెళ్లిపోయాయి. మీపోరు మీదే - మా బాట మాదే అని తేల్చేశాయి. అంతకంటె అన్ని పార్టీలు గట్టి పోరాటాలే నడుపుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రణాళిక చెప్పకుండా.. పార్టీలను ఆహ్వానిస్తే.. అఖిలపక్షం సక్సెస్ అవుతుందా? లేదా? సందేహంగానే ఉంది.