ర‌మ‌ణ దీక్షితులు ఇంట్లో వైఎస్ ఫొటో ఉండ‌కూడ‌దా?

Update: 2018-05-23 11:10 GMT
రాజ‌కీయాల్లో ఒక వ్య‌క్తిని నేరుగా ఎదుర్కోవ‌డం చేత‌కాక‌పోతే.....అస‌మ‌ర్థ నాయ‌కులు ఎంచుకునే ఏకైక ప‌ద్ధ‌తి వ్య‌క్తిగ‌త హ‌న‌నం. ప్ర‌భుత్వాన్ని - పాల‌కుల‌ను....వారు చేసిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను ప్ర‌శ్నించిన వ్య‌క్తి వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై దాడి చేయ‌డం....వాటిని బ‌హిరంగంగా వెల్ల‌డించి చౌక‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డం ఇపుడు న‌యా ట్రెండ్. తాజాగా, టీటీడీ వివాదంలో ర‌మ‌ణ దీక్షితులుపై కూడా సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లు చేశారు. ర‌మ‌ణ‌దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లు - ఆరోప‌ణ‌కు జ‌వాబు చెప్ప‌లేక ఆయ‌న క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ కు చంద్ర‌బాబు పాల్ప‌డ్డారు. ర‌మ‌ణ దీక్షితులు ఇంట్లో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఫొటో ప‌క్క‌న దివంగ‌త నేత వైఎస్ ఆర్ ఫొటో ఉండడాన్ని కూడా చంద్ర‌బాబు రాజ‌కీయం చేశారు. త‌న‌పై ర‌మ‌ణ దీక్షితులు చేస్తోన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లకు బ‌దులు చెప్ప‌లేక అయ‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

వాస్త‌వానికి త‌మ అభిమాన న‌టీన‌టుల‌తో - రాజ‌కీయ నేత‌ల‌తో దిగిన ఫొటోల‌ను వారి జ్ఞాప‌కార్థం ఇంట్లో ఉంచుకోవ‌డం స‌ర్వ‌సాధారణం. సినీన‌టుడిగా - మాన‌వ‌తావాదిగా ప‌వ‌న్ ను అభిమానించే చాలామంది టీడీపీ - వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌లో ప‌వ‌న్ ఫొటోలున్నాయి. అంత‌మాత్రాన వారు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుదారులైపోరు. అదే త‌ర‌హాలో అప‌ర భ‌గీర‌థుడిగా, పేద‌ల ముఖ్య‌మంత్రిగా పేరుపొందిన వైఎస్ అంటే సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు చాలామందికి అభిమానం. ఆ అభిమానంతోనే దివంగ‌త‌నేత‌తో దిగిన ఫొటోల‌ను ర‌మ‌ణ దీక్షితులు కూడా తన ఇంట్లో ...వెంక‌న్న స్వామి పక్క‌న పెట్టారు. దీనిని కూడా చంద్ర‌బాబు రాజ‌కీయం చేసి....వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇక టీడీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో...ర‌మ‌ణ దీక్షితులుపై త‌మిళ బ్రాహ్మ‌ణుడు అనే విష‌ ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు. అలా అయితే, ఉత్త‌రాదికి చెందిన అనిల్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించడం -  మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ గా నియ‌మించ‌డంపై కూడా చంద్ర‌బాబు వివ‌ర‌ణ ఇవ్వాలి. దుర్గగుడిలో అర్థరాత్రి క్షుద్ర‌పూజ‌లు జ‌రిగాయ‌ని నిర్ధార‌ణ అయినా....బాధ్యుల పేర్లు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం పై కూడా చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. ర‌మ‌ణ దీక్షితులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వఅవాస్త‌వాల‌పై విచార‌ణ చేప‌ట్టి...వివ‌ర‌ణ ఇవ్వాల్సిన చంద్ర‌బాబు ఇటువంటి చౌక‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 
Tags:    

Similar News