చంద్రుళ్ల ఇద్దరి ఏకాంత భేటీలో ఏం జరిగింది?

Update: 2017-01-27 05:05 GMT
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండుతెలుగు రాష్ట్రాల గవర్నర్ అయిన నరసింహన్ తన అధికార నివాసంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి26న.. ఆగస్టు 15న గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. సంప్రదాయానికి తగ్గట్లుగా జరిగే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావటంతో.. ఆసక్తికరంగా మారింది.

ఇద్దరు చంద్రుళ్లు ఒక చోట కలవటం.. గవర్నర్ నరసింహన్ కు చేరో పక్క కూర్చోవటం లాంటివి చేశారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు చంద్రుళ్ల మధ్య పావు గంట పాటు ఏకాంత చర్చలు జరగటం గమనార్హం. ఈ ఏకాంత భేటీలో ఇద్దరి చంద్రుళ్లు మధ్య వచ్చిన విషయాలు ఏమిటన్నవిబయటకు రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్యనున్న వివాదాల గురించి మాట్లాడుకొని ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఉద్యోగుల విభజనతో పాటు.. రాష్ట్రంలో చోటు చేసుకున్న అంశాల మీద కూడా వారి మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు ఈ నెలాఖరున ఏపీకి వస్తునన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు.

గతానికి భిన్నంగా ఇద్దరు చంద్రుళ్ల మధ్య ఉల్లాసపూరిత వాతావరణంలో చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరువురు ముఖ్యమంత్రులు నవ్వుతూ మాట్లాడుకోవటం కనిపించింది. పావుగంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన చంద్రుళ్లు.. .ఇద్దరు ఎట్ హోం కార్యక్రమంలో దాదాపు అరగంటకు పైనే.. అందరిముందు మాట్లాడుకున్నారు. ఇద్దరు చంద్రుళ్ల మాటామంతిని.. వారి హావభావాల్ని పలువురు ఆసక్తిగా గమనించటం.. వారి గురించి మాట్లాడుకోవటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News