ఉప్పు నిప్పుగా ఉంటున్న రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలైన నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మరోసారి చేతులు కలపనున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమానికి వీరిద్దరు హాజరు అయ్యే ఛాన్సులున్నాయి.
రాష్ర్ట విభజన తర్వాత ఈ ఇద్దరు చంద్రులు గతంలో రాజ్ భవన్ లో కలుసుకుని పరసర్పరం చేతులు కలుపుకున్నారు. తాజాగా ఆగస్టు 15న రాజ్ భవన్ ఎట్ హోం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ రెండు రాష్ర్టాల సీఎంలను ఆహ్వానించనున్నారు. ఇక్కడకు ఇద్దరు చంద్రులు వస్తే వీరు ఎలా పలకరించుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
అలాగే గవర్నర్ వీరిద్దరితో రాష్ర్ట విభజన సమస్యలపై మాట్లాడి కొన్నింటికి పరిష్కారం ఇచ్చే ఆలోచన కూడా చేయనున్నారట. ఓటుకు నోటు లాంటి సీరియస్ పరిణామం తర్వాత రాజ్ భవన్ వేదికగా వీరిద్దరు కలుసుకోనుండడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.