బెజవాడలో బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. హైదరాబాద్ కు రావాల్సింది పోయి బెంగళూరు వెళ్లిన వైనం చోటు చేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి బాబు అంటే మాటలా? ఆయన అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే. మరి.. అలాంటి బాబు.. ఇప్పుడు అందరితో కలిసి విమానం ఎక్కాల్సిన పరిస్థితి. పవర్ పోయినంతనే స్పెషల్ ఫ్లైట్ ను పక్కన పెట్టేసిన బాబు.. గురువారం రాత్రి బెజవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.
కొడుకుతో కలిసి బయలుదేరిన చంద్రబాబు.. వారెక్కిన ఎయిరిండియా విమానం హైదరాబాద్ కు కాకుండా బెంగళూరుకు తరలించారు. వాతావరణం ప్రతికూలంగా మారటంతో వారు ప్రయాణిస్తున్న ప్లైట్ ను బెంగళూరుకు తరలించారు. దీంతో బాబు షెడ్యూల్ మొత్తం మారిపోయింది.
గురువారం రాత్రి 7.20కు బెజవాడలో బయలుదేరిన విమానం వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవటంతో బెంగళూరుకు రాత్రి 9.20 గంటలకు చేరుకుంది. అనంతరం అక్కడే ఉంచిన విమానం.. వాతావరణం అనుకూలించటంతో రాత్రి 10.30 గంటలకు బయలుదేరింది. చివరకు అర్థరాత్రి సమయానికి హైదరాబాద్ కు చేరుకున్నారు చంద్రబాబు. మొత్తంగా బెజవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకోవటానికి ఏడు గంటల కంటే ఎక్కువ సమయమే చంద్రబాబు.. చినబాబు ఇద్దరూ విమానంలోనే గడపాల్సి వచ్చింది.