నిన్న పవన్‌ - రేపు చంద్రబాబు

Update: 2019-04-06 17:04 GMT
 అతడు సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ఎన్నికల ముందు ఏదైనా జరిగి హాస్పిటల్ పాలైతే.. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయి అధికారం హస్తగతం అవుతుందని చెప్తాడు సాయాజీ షిండే. అంటే వీల్‌ చైర్‌ టు సీఎం చైర్ అంటూ డైలాగ్‌ చెప్తాడు. ప్రస్తుతం ఏపీలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ రాజకీయాలే నడుస్తున్నాయా అంటే అవుననే అంటోంది వైసీపీ. ఎన్నికలు దగ్గరపడే సరికి అధికారాన్ని పొందేందుకు చంద్రబాబు నాయుడు ఎలాంటి డ్రామాలు అయినా ఆడతారని ఆరోపిస్తోంది.

 నిన్నటికి నిన్న పవన్‌ కల్యాణ్‌ కు వడదెబ్బ తగిలింది. నాన్‌ స్టాప్‌ గా ఎండల్లో ప్రచారం చేయడం వల్ల పవన్ బాగా నీరసించిపోయారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించడంతో.. శనివారం పూర్తిగా రెస్ట్‌ తీసుకున్నారు. ఇప్పుడు పవన్‌ లాగే చంద్రబాబు నాయుడుకి కూడా వడ దెబ్బ తగులుతుందని.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం కంప్లీట్‌ అయ్యిందని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. ఏప్రిల్‌ 9 సాయంత్రం చంద్రబాబుకి వడదెబ్బ తగులుతుందని.. ఆ వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం.. ఏప్రిల్‌ 11 రోజు సాయంత్రం డిశ్చార్జ్‌ అవ్వడం జరుగుతాయని.. ఇవన్నీ ఎన్నికల స్టంట్‌ లో భాగమని విమర్శిస్తోంది వైసీపీ.
       
పవన్‌ - జగన్‌ - షర్మిళ - విజయమ్మ.. ఇలా వీళ్లంతా.. ఓపెన్‌ టాప్‌ వ్యాన్‌ లలో ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లో తిరుగుతున్నారు. కానీ ఒక్క చంద్రబాబు మాత్రం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసిన బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. సాయంత్రానికి అంటే చల్ల బడిన తర్వాత ఓపెన్‌ టాప్‌ వ్యాన్‌ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే.. వడదెబ్బ తగలకుండా చంద్రబాబు ఆల్‌ రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఎన్నికల ముందు సెంటిమెంట్‌ అస్త్రాన్ని వాడుకునేందుకు వడదెబ్బ డ్రామాలు ఆడతారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైసీపీ నాయకులు.
Tags:    

Similar News