ఆగస్టు సంక్షోభం.. టీడీపీకి ‘చంద్ర’గ్రహణం

Update: 2019-07-19 04:20 GMT
తెలుగుదేశం పార్టీకి - ఆగస్టు నెలకు ఉన్న సంబంధం చరిత్రలో ఓ సంచలనం.. ఇప్పుడు ఆగస్టు వస్తోందంటే చాలు టీడీపీ సినియర్లు వణికిపోతున్నారు. చంద్రబాబు కూడా ఆగస్టు నెలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది.

టీడీపీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడి.. గెలిచిన ఎంపీలు వలసలు పోయి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు పార్టీని నిలబెడుతారా లేదా.? ఎమ్మెల్యేలు జంప్ అవుతారా అన్న భయం వెంటాడుతోంది. ఇప్పుడు ఆగస్టు నెల వస్తోంది. మరోసారి ఆగస్టు సంక్షోభం టీడీపీలో వస్తుందా అన్న భయం వెంటాడుతోందట..

తెలుగుదేశం స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ కు ఆగస్టు నెల పీడకలను మిగిల్చాయి. ఆయనకు తగిలిన రెండు దెబ్బలు ఆగస్టులోనే తాకాయి. ఆగస్టులోనే ఎన్టీఆర్ రెండు సార్లు అధికారం కోల్పోయారు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు టీడీపీలో తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ ను గద్దెదించి సీఎం అయ్యారు. ఆ తర్వాత 11 ఏళ్లకు ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన మామ అయిన ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.

ఇక ఉమ్మడి ఏపీలో తీవ్రకలకలం రేపి  చంద్రబాబు సీఎంగా ఉండగా.. టీడీపీ ఓడిపోవడానికి ప్రధానమైన బషీర్ బాగ్ కాల్పులు 2000 ఆగస్టులోనే జరిగాయి.. 2004లో టీడీపీ ఓడి 10 ఏళ్లు అధికారానికి దూరమైంది.

ఇప్పటికీ చంద్రబాబు సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్న సంక్షేమ పథకాలు..ఇతర ఏ కార్యక్రమాలు ఆగస్టులో నిర్వహించడానికి సాహసించరని  పార్టీలో చర్చ జరుగుతుంటుంది. మళ్లీ ఆగస్టు వచ్చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో నాయకులను కాపాడుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. ఇప్పుడు ఆగస్టులోనే టీడీపీకి షాకిచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ రెడీ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుకు ఎలాంటి స్థితి ఎదురవుతుందో చూడాలి మరీ. .


Tags:    

Similar News