ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందాలు.. టీడీపీలో వణుకు

Update: 2020-02-09 09:33 GMT
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు  శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ భవన్ కు కూడా వెళ్లకుండా ఇంట్లోనే తీవ్ర సమాలోచనలు జరుపుతున్నారట.. ఆందోళన చెందుతున్నారట.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాల తనిఖీలు ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

గురువారం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ రావుపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు దాడి చేశాయి. మాజీ మంత్రి లోకేష్, చంద్రబాబు సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో సాగుతున్న ఢిల్లీ ఐటీ బృందాల దాడులతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో - విజయవాడ - హైదరాబాద్ లలో ఢిల్లీ ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. విజయవాడ గాయత్రినగర్ లో సోదాల్లో రహస్య లాకర్ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇందులో టీడీపీకి చెందిన ముఖ్యనేతకు ఇచ్చిన 150 కోట్ల ముడుపుల లెక్క ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముంబైకి చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చిన లెక్కలని సమాచారం.  ఇక లోకేష్ బినామీగా ప్రచారం జరుగుతున్న కిలారు రాకేష్ వందల కోట్ల ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్టుగా సమాచారం అందుతోంది.

తాజాగా లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన కిలారీ రాజేశ్  - నరేన్ చౌదరిలను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారవర్గాలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. అరెస్టులు - అదుపులోకి తీసుకెన్నదెవరు? దొరికింది ఎంత? తదితర వివరాలను ఐటీ అధికారులు వెల్లడించలేదు.


Tags:    

Similar News