ఎన్నికలకు ముందు పార్టీలు మారడం.. గెలిచే పార్టీలో చేరి హాయిగా మంత్రి పదవి కొట్టేయడమొక్కటే కాదు ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ ఎప్పుడై లైమ్ లైట్లో ఉండే నేత గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇంతకాలం బాగానే నడిచినా ఇప్పుడు మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు వద్ద ఆయన ఇమేజి భారీగా డ్యామేజి అయినట్లు స్పష్టమవుతోంది.
మూడురోజుల పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడురోజుల నుంచి ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లతో రోడ్డెక్కిన వైనం ప్రభుత్వానికి చెమటలు పట్టించింది. దానిపై చంద్రబాబునాయుడు గత మూడురోజుల నుంచీ సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లపై చర్చించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు విలేఖరుల సమావేశం నిర్వహించి వెల్లడించాలని చంద్రబాబునాయుడు మూడురోజులుగా గంటాకు ఇచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఉపాధ్యాయ సంఘాలు చలో సచివాలయానికి పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని సీఎం ఫీలయ్యారట. చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించాకే గురువారం రాత్రి పదిన్నర నుంచి అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలను చర్చలకు పిలిపించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి.
గంటా ముందుగానే స్పందించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చంద్రబాబు ఫైరయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, కోరిన డిమాండ్లు నెరవేరుస్తున్నప్పటికీ.. సకాలంలో వారి సమస్యలపై స్పందించని కారణంగా, ప్రభుత్వం చేసిన మేలంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు.
ఇంతకుముందు భూకుంభకోణం విషయంలోనూ గంటా కారణంగానే అప్రతిష్ఠ పాలయ్యామని చంద్రబాబు సహా టీడీపీ అంతా అనుకుంటోంది. గతంలో కాపు సామాజిక వర్గం విషయంలో ఆయన అనుసరించి పద్ధతులపైనా చంద్రబాబు గంటాపై గుర్రుగా ఉన్నట్లు చెప్తున్నారు. గంటాపై తాను విశ్వాసం కోల్పోయానని కూడా చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/