ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తుండగా కొన్ని పదవులను భర్తీ చేశారు. అయితే పలు కారణాల వల్ల మొత్తం పదవులను భర్తీ చేయలేదు. ఈ విషయంలో పలు సందర్భాల్లో పార్టీ సీనియర్లు సైతం బాబు దృష్టికి పదవుల భర్తీ అంశాన్ని తీసుకువచ్చారు. ఒకింత సుదీర్ఘ కసరత్తు అనంతరం తాజాగా పెండింగ్ నామినేటెడ్ పదవులను చంద్రబాబు భర్తీ చేశారు.
మరోవైపు ఈ పదవుల పందేరంలో సైతం తనదైన శైలిలో సమీకరణాలకు చంద్రబాబు పెద్ద పీట వేశారు. పార్టీ ఫిరాయించిన నేతకు బెర్తు ఖరారు చేయడంతో పాటుగా ఎన్నికలను జరుగుతున్న కర్నూలు జిల్లా నంద్యాలను సైతం దృష్టిలో ఉంచుకొని పలువురు నాయకులకు చాన్స్ కల్పించారు. దీంతోపాటుగా యథావిధిగా కుల సమీకరణాలను సైతం బాబు పరిగణనలోకి తీసుకున్నారు. వైసీపీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు తాజాగా బాబు ఉపశమనం కలిగించారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా జలీల్ ఖాన్ ను నియమించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికలు ఉన్న నేపత్యంలో కర్నూల్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లును చంద్రబాబు నియమించారు.
తాజా నియామకాలు ఇలా ఉన్నాయి.
వక్ఫ్ బోర్డు ఛైర్మన్- జలీల్ ఖాన్
కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్- నరసింహయాదవ్
రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్- జె.ఆర్.పుష్పరాజ్
ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-అంబికా కృష్ణ
ఉర్దూ అకాడమీ ఛైర్మన్- నౌమాన్
లిడ్ క్యాప్ ఛైర్మన్- ఎరిక్షన్‌బాబు
మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ప్రకాశ్ నాయుడు