రాజధాని కోసం రూ.4వేల కోట్లు అడగనున్నారా?

Update: 2015-08-19 05:29 GMT
రాష్ట్ర విభజన పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోవటం తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయిల నిధులు అవసరమైనా.. ప్రస్తుతానికి అవసరమైన నిదుల గురించి ప్రధాని మోడీని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడగనున్నారని చెబుతున్నారు. ఏపీ రాజధాని కోసం రూ.1500కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. నిర్మాణ పనులకు ఆ మొత్తం సరిపోదని.. రూ.4వేల కోట్ల వరకూ అవసరమవుతాయని ప్రధానికి ఏపీ ముఖ్యమంత్రి చెబుతారంటున్నారు.

ప్రధాని మోడీని గురువారం ఏపీ ముఖ్యమంత్రి భేటీ కానున్న సమయంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపు మొత్తాన్ని రూ.1500 కోట్ల నుంచి రూ.4వేల కోట్లకు పెంచే అంశాన్ని ప్రస్తావిస్తారని.. దసరాకు అమరావతి నగరానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో.. వెనువెంనటే పనులు మొదలు పెట్టేందుకు ఈ మొత్తం అవసరం కానున్నట్లుగా చెబుతున్నారు. మరి.. బాబు కోరినట్లుగా అమరావతికి రూ.4వేల కోట్లకు మోడీ ఓకే చెబుతారా..?

 
Tags:    

Similar News