ఇండియాలో తొలి బీటా బేబీ ఎక్కడ పుట్టిందంటే..! ఆ బుడ్డోడి పేరు తెలిస్తే షాకే.?
ఇండియాలో కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే తొలి బేబీ ఎక్కడ పుట్టిందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది.
ఈ ఏడాది తొలి రోజు నుంచే కొత్త జనరేషన్ ప్రారంభమైంది. 2025 నుంచి 2039 మధ్య పుట్టే వారంతా కొత్త జనరేషన్ న్యూ జనరేషన్ కిడ్స్ గా పరిగణించబడతారు. ఈ జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. ఇండియాలో కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే తొలి బేబీ ఎక్కడ పుట్టిందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆ తొలి బేబీని తొలి బీటా బేబీగా పిలుస్తుంటాం.
న్యూఇయర్ రోజు తొలి బీటా బేబీగా మిజోరం రాష్ట్రానికి చెందిన శిశువు గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రంలోనే రామ్జీర్ మావీ, రెమ్రువాత్ సంగా దంపతులకు జన్మించిన శిశువుగా గుర్తించారు. ఈ తొలి బీటా శిశువుకు తల్లిదండ్రులు ఫ్రాంకీ రెమ్రువాత్ డికా జాడింగ్ అని నామకరణం చేశారు. ఈ బాబు జనవరి ఒకటో తేదీ రాత్రి 12.03 గంటలకు జన్మించాడు. కొత్త ఏడాది దేశంలో పుట్టిన తొలి శిశువు కాబట్టే తొలి బేటా బేబీగా ఈ చిన్నారికి గుర్తింపు లభించింది. మిజోరం రాష్ట్రంలోని డర్ట్ లాంగ్‌లో ఉన్న సినోడ్ హాస్పిటల్లో ఈ చిన్నారి జన్మించింది. కొత్త ఏడాది ప్రారంభమైన మూడు నిమిషాలకే ఈ బిడ్డ జన్మించడం విశేషం.
ప్రస్తుతం ఈ చిన్నారి అత్యంత ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో కొత్త జనరేషన్‌కు ఈ చిన్నారి ప్రాణం పోశాడు. ఈ బిడ్డ పుట్టిన వెంటనే మూడు కేజీల 120 గ్రాముల బరువు ఉన్నాడు. సాధారణ ప్రసవం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ పుట్టినప్పుడు వైద్యులతోపాటు తల్లిదండ్రులకు కూడా తొలి బీటా శిశువుగా పిలుస్తాడని ఊహించలేదు. తమ బిడ్డే కొత్త జనరేషన్ కు తొలి వ్యక్తి కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘తనను డెలివరీ కోసం డిసెంబర్ 31వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. అదృష్టం కొద్ది బిడ్డ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుట్టాడు. కానీ, తాను ఇండియాలో తొలి బీటా బేబీకి జన్మ నిస్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఈ విషయమే తనకు తెలియదు. కానీ అదృష్టం తమ వైపు ఉంది’ అని ఐదేళ్ల తర్వాత రెండో కాన్పులో తొలి బేటా శిశువుకు జన్మనిచ్చిన తల్లి చెప్పింది. ప్రస్తుతం ఈ జంటకు ఐదేళ్ల వయసు ఉన్న పాప ఉంది ఉంది. తమ ఆసుపత్రిలో కొత్త జనరేషన్ కిడ్ జన్మించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. దీనికి ముందు 2010-24 వరకు ఆల్ఫా జనరేషన్ బిడ్డలు పుట్టారు.
ఈ 14 ఏళ్ల మధ్యకాలంలో పుట్టిన చిన్నారులను ఆల్ఫా జనరేషన్ కిడ్స్‌గా పేర్కొంటారు. కొత్త ఏడాది నుంచి పుట్టిన వారిని బీటా జనరేషన్ కిడ్స్ గా వ్యవహరిస్తారు. పిల్లలకు టెక్నాలజీతో ఎక్కువ సంబంధం ఉంటుంది. వీరి ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్, పర్యావరణ ఇన్నోవేషన్లు వేగంగా మారే భవిష్యత్తును చూడనున్నారు ఎక్కువ డిజిటల్ ప్రపంచాన్ని వీరు వీక్షిస్తారు.