బరిలో ఉన్నోడికి గెలుపు ధీమా తప్పనిసరి. అయితే.. వాస్తవికతకు దగ్గరగా గెలుపు అవకాశాల్ని మదింపు చేస్తే అనవసరమైన అవమానం తప్పుతుంది. అందుకు భిన్నంగా అవసరానికి మించిన హడావుడితో లేనిపోని తలనొప్పులు ఖాయం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇదే తీరులో కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలుమహా ఉత్కంటగా మారటం తెలిసిందే. ఏపీ వరకూ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. ఎవరు విజయం సాధిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికార.. విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నడిచినప్పటికీ ఎక్కువ అవకాశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే జగన్ తీరు కూడా మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలయ్యాక కూడా ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో హడావుడి చేస్తున్న చంద్రబాబు.. తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు.
గెలుపు మీద మస్తు ధీమాను వ్యక్తం చేస్తున్న టీడీపీ అధినేత.. ఎన్నికల్లో విజయం తమదేనని తేల్చి చెబుతున్నారు. పోలింగ్ పూర్తి అయ్యాక బరిలో ఉన్న వారంతా గెలుపు మీద నమ్మకంతో ఉండటం కామన్. అంత మాత్రానికే గెలిచేసినట్లుగా వ్యవహరించటం అతి అవుతుందే తప్పించి ఇంకేమీ కాదు. ఈ నెల 22 నాటికి ఎన్నికల బరిలో నిలిచిన తమ్ముళ్లంతా అమరావతికి రావాలని.. పోలింగ్ జరిగిన తీరును సమీక్షించనున్నట్లుగా బాబు ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై తమ్ముళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ గుంభనంగా ఉండటం.. గెలుపు ఓటముల మీద తొందరపడి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు హడావుడి చేయటం వరకూ బాగానే ఉంటుందని.. రేపొద్దున ఫలితాలు వచ్చాక.. అనుకున్న దానికి భిన్నమైన రిజల్ట్ వస్తే ఎంత ఛండాలంగా ఉంటుందన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. అధినేతకు ఇవేమీ అర్థం కావట్లేదన్న మాట తమ్ముళ్ల నోట వినిపిస్తుండటం గమనార్హం. గెలుపు ధీమా తప్పు లేదు కానీ.. భారీ స్థాయిలో సమీక్షలు.. సమావేశాలు.. గెలుపు లెక్కలు వేసే తీరు అతిగా ఉంటుందన్న విమర్శ వినిపిస్తోంది. బాబు నిర్ణయాలకు తమ్ముళ్లు విస్తుపోతున్నారు. ఒకవేళ తాము అనుకున్న దాని కంటే భిన్నమైన ఫలితం వస్తే నవ్వులపాలు కావటం ఖాయమన్న ఆవేదనను కొందరు కీలక నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి.. బాబుకు ఇవేమీ పట్టవా?