అమెరికా ఎన్నికలు షురూ.. డిక్స్ విల్లేలో ఫిఫ్టీ..ఫిఫ్టీ..
దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తారు.
ప్రపంచ దేశాలు సహా.. నిపుణులు, మేధావులు, వ్యాపార వేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మన దేశంలో మాదిరిగా.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అక్కడ కొనసాగదు. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్, ఎన్నికల సంఘం అధికారులు కలిసి నిర్ణీత సమయాన్ని ప్రతిపా దిస్తారు. దీంతో అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ జరిగే రోజును భారత్‌లో సెలవు దినంగా ప్రకటిస్తారు. కానీ, అమెరికాలో మాత్రం వర్కింగ్ డేగానే చూస్తారు. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తారు.
రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య, వారిలో ఉద్యోగులు, కార్మికులు, స్కిల్డ్ లేబర్.. విద్యార్థులు ఇలా అనేక కేటగిరీలలో వారిని నిర్ణయించి.. వారికి అనుకూలంగా సమయం కేటాయిస్తారు. ఇలా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత కాల మానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకే(అమెరికాలో అర్ధరాత్రి) ప్రారంభమయ్యాయి. తొలిగా న్యూహ్యాంప్ షైర్ రాష్ట్రంలోని డిక్స్ వెల్లే నాచ్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 6. ఈ ఆరుగురు ఓటు హక్కు వినియోగించుకోగానే.. 20 నిమిషాల సమయం అనంతరం.. ఫలితాన్ని కూడా ప్రకటించారు. నిజానికి మన దేశంలో ఫలితం ప్రకటించరు.
ఎందుకంటే.. ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభావం పడుతుందని భావిస్తారు. కానీ, అమెరికా తీరే వేరుకదా! అందుకే.. డిక్స్ విల్లే నాచ్‌లో అధికారులు ఫలితం ప్రకటించారు. ఇక్కడి ఆరుగురు ఓటర్లు కూడా.. డెమొక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు.. కమల హ్యారిస్‌కు 3 ఓట్లు వేయగా, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 3 ఓట్లు వేశారు. అనంతరం.. 20 గ్యాప్‌లో ఈ ఫలితాన్ని అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే.. ఉదయం ఆరు గంటల నుంచే పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిపక్కా ఏర్పాట్లు చేశారు.
చాలా టఫ్ !
ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా చాలా టఫ్‌గా మారనున్నాయి. ప్రజల మూడ్‌ను ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కూడా పక్కాగా అంచనా వేయలేకపోయింది. ఈ ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో మాదిరిగా.. ఇక్కడ ముందస్తు సర్వేల ప్రకారం ఎవరు గెలుస్తారనే విషయం స్పష్టంగా ఎవరూ చెప్పలేక పోవడం గమనార్హం. మరోవైపు.. సోషల్ మీడియాలో కమల వర్సెస్ ట్రంప్ మద్దతు దారులు తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు ఈ మద్దతు దారుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. అమెరికా ఫలితం చాలా టఫ్‌గా నే మారనుందని తెలుస్తోంది.