మోడీ, బాబును బజారుకు ఈడుస్తున్న పవన్ కళ్యాణ్!?
దీనికి కారణం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సంచలన కామెంట్లు.
రాజకీయాల్లో పొత్తులు పెట్టుకున్నపుడు సహజంగానే ఇతర పార్టీల నేతల మంచి చెడుల ప్రభావాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. చరిష్మా గల నేత వల్ల వచ్చే అడ్వాంటేజ్ సొంతం చేసుకోవడంతో పాటుగా వారి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సైతం ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితే ఇప్పుడు అటు బీజేపీ రథసారథి నరేంద్ర మోడీ, ఇటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం, మిత్రపక్ష పార్టీ నేత అయిన పవన్ కళ్యాణ్ వల్ల అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సంచలన కామెంట్లు.
ఏపీలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంటూ ఈ ఘటనలకు హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ విషయం చాలా కీలకమని పేర్కొన్న పవన్...ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. దీనిపై సమర్థ, విమర్శపూర్వక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ కామెంట్లలోకి కులం, స్వపక్షం సమస్యలు అనే కొత్త అంశాలు వచ్చిచేరాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆసక్తికరంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత పై చేసిన వ్యాఖ్యలు అవమానపరిచేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి వర్గంలో మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ తప్పుపట్టారు. హోంమంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అని తెలిపిన మందకృష్ణ దీన్ని మనసులో పెట్టుకుంటాం అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ దళితులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని సైతం మందకృష్ణ ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ఏపీ హోంమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కులం రంగు మారడం ఇటు బీజేపీ, అటు టీడీపీని ఇబ్బంది పెట్టేవిగా మారుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, బీజేపీ, టీడీపీ కూటమిలో జనసేన కూడా భాగస్వామ్య పార్టీ కాబట్టి. అయితే, మందకృష్ణ దూకుడుగా స్పందించకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం, గౌరవం ఒక కారణమైతే... ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం. కానీ తాజాగా పవన్ కామెంట్లపై కులం కోణంలో మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు అటు మోడీని, ఇటు బాబును ఇరకాటంలో పడేస్తాయోమో... దళితుల వ్యతిరేక ముద్ర వేస్తాయేమో అనే డౌటనుమానాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.