భగవంతుడిపైనా నిందలేస్తున్న చంద్రబాబు

Update: 2016-11-05 14:42 GMT
    రెండు టెర్ముల పాలన వరుస తరువాత... పదేళ్ల గ్యాప్ తరువాత మూడోసారి అధికారం చేపట్టి మూడేళ్లవుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబుకు తన బాధ్యతలు గుర్తొచ్చాయి. త‌న‌కు మూడు బాధ్యత‌లున్నాయ‌ని ఈ రోజు ఆయన ప్రకటించారు. ప్రజ‌ల సంక్షేమానికి పాటుప‌డ‌డం.. కుటుంబ పెద్దలా పార్టీ నేత‌లు - కార్యక‌ర్తలను ఆదుకోవ‌డం.. సొంత కుటుంబ ఆలనాపాలనా చూసుకోవడం తన మూడు బాధ్యతలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. క‌ర్నూలు జిల్లాలో ప‌ర్యటిస్తోన్న ఆయ‌న జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప‌నుల‌కి శంకుస్థాప‌న చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన బాధ్యతలేమిటో చెప్పుకొచ్చారు. భగవంతుడి కారణంగా తన బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నానంటూ నెపం నెట్టేశారు.

త‌న‌కు కుటుంబ స‌భ్యుల‌తో అధిక స‌మ‌యం గ‌డిపే అవ‌కాశాన్ని భ‌గ‌వంతుడు ఇవ్వలేదని అన్నారు. త‌న‌ కుటుంబ బాధ్యత‌ల్లో భాగంగా హెరిటేజ్ కంపెనీ పెట్టుకున్నామని... ఆ కంపెనీ నీతినిజాయతీలతో పనిచేస్తోందని చెప్పారు. అందరూ నీతినిజాయతీలతో పనిచేయాల‌ని, ప్ర‌లోభాల‌కు లోనుకాకూడ‌దని చెప్పారు. 'శభాష్ తెలుగు దేశం పార్టీ' అని అంద‌రు చెప్పుకునేలా పార్టీని న‌డిపించాల‌ని కార్యక‌ర్తల‌కు పిలుపునిచ్చారు.

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించాలని.. వైసీపీ - కాంగ్రెస్ లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కార్యక‌ర్తల‌కు 2 ల‌క్షల రూపాయ‌ల బీమా  ఇస్తున్నామ‌ని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల అనుభవం తరువాతైన బాబుకు బాధ్యతలు గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉందని సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News