ఒక్కోసారి....ఉద్దేశం ఒకటి అయితే సందర్భానికి తగినట్లుగా అది మరో రకంగా మారిపోతుంది. ఇపుడు సేమ్ టు సేమ్ పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య నెలకొందనే చర్చ సాగుతోంది. ఇటీవల చంద్రబాబు మీడియాతో అన్ని విషయాలు మాట్లాడుకొస్తూ...ప్రపంచవ్యాప్తంగా జనాల్లో నానుతున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి స్పందించారు. భారతదేశంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ అమెరికాలో అలా కాకుండా ఆయా వ్యక్తులు తమకు నచ్చినట్లుగా పెళ్లిళ్లు చేసేసుకుంటారు. ట్రంప్ భార్య సైతం ఇప్పుడు నాలుగో ఆవిడ కావొచ్చు అనే భావనతో బాబుమాట్లాడారు. అయితే ఇది పవన్ అప్లై చేస్తూ కొత్త చర్చ ప్రారంభమైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది పవన్ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ బాబు వ్యాఖ్యలతో కొందరు పవన్ కు లింక్ పెడుతున్నారు. చంద్రబాబు సందర్భోచితంగా అన్నప్పటికీ అలా చెప్పిన విలువలు పవన్ కు సైతం అప్లై అవుతాయి కదా అంటున్నారు. భారతదేశంలో ఒక భార్య-ఒక భర్త సిద్ధాంతం చెప్తూ పోల్చిన ఉదాహరణ పవన్ ను పరోక్షంగా ఇరకాటంలో పడేసిందని స్థూలంగా తేలుతున్న అభిప్రాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/