మాటెత్తితే తనది నలభై సంవత్సరాల అనుభవం అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. ఆ నలభై ఏళ్లలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఆయన. అయితే ఆయన మాటలు మాత్రం ఆస్థాయికి తగ్గట్టుగా ఉండటం లేదు. ఒక గల్లీ లీడర్ లా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు.
ప్రత్యేకించి గత కొన్నాళ్లలో చంద్రబాబు నాయుడులో అసహనం పెల్లుబుకుతూ ఉంది. జగన్ మోహన్ రెడ్డి మీద వీర లెవల్లో విరుచుకుపడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారం మొదలైననాటి నుంచి ఇదే కథ. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడి తీరు ఏమీ మారినట్టుగా కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు - వాడే భాష.. ఏదీ కూడా పద్ధతిగా లేదని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీ అప్పుల గురించి మాట్లాడారు. గత ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడటమే పెద్ద కామెడీ.
రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రానికి ఉండిన అప్పు లక్షా ఇరవై వేల కోట్లు కాగా - తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు మరో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశాడని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. దాదాపుగా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు.
ఇలాంటి నేఫథ్యంలో.. ఇప్పుడు ఆయన అప్పుల గురించి మాట్లాడుతూ ఉండటం గమనార్హం. ‘జగన్ మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పాలన సాగిస్తే వాటిని తీర్చేది ఎవరు..’ అంటూ చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారట. మరిగత ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు చంద్రబాబు మీరు - వాటిని ఎవరు తీర్చాలి? అని అనే ప్రశ్నకు సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు తర్వాత మాట్లాడాలి ఇలాంటి మాటలు.
తన హయాంలో తెచ్చిన అప్పులను చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లాభాలతో తీరుస్తారా? లేక కుటుంబ ఆస్తులు అమ్మి తీరుస్తారా? అప్పులు తెచ్చి ఓట్లను కొనే ప్రయత్నం చేశారు. అది వర్కవుట్ కాక ఇలా ప్రతిపక్షంలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకు తోచిన రీతిలో మాట్లాడి.. రోజు రోజుకూ దిగజారి పోతున్నాడని పరిశీలకులు అంటున్నారు.
తమ నాలుగు నెలల పాలనలో ఎప్పుడూ ఓడీకి వెళ్లలేదని - అయితే చంద్రబాబు నాయుడు పాలనలో ఓడీకి వెళ్లని సమయం అంటూ లేదని ఇటీవలే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ప్రకటించారు. అయినా చంద్రబాబు నాయుడు తీరు అలా ఉంది.