లోకేశ్‌ పొలిటిక‌ల్ ఎంట్రీ డేట్ ఫిక్స్‌

Update: 2016-04-18 17:26 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ రాజ‌కీయ అరంగేట్రానికి రంగం సిద్ధ‌మైంది. ర‌క‌ర‌కాల అంచ‌నాలు - రాజకీయ విశ్లేష‌కుల అభిప్రాయాల నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు ఈ ఎపిసోడ్‌ పై క్లారిటీ ఇచ్చారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కేబినెట్ స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యం వెల్ల‌డించారు.

లోకేశ్‌ ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకునే విష‌య‌మై మీడియా ప్ర‌తినిధులు చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా...త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో ఈ విష‌యం మాట్లాడుకుందాం అని చంద్ర‌బాబు అన్నారు. దీంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌ని తేల‌డంతో పాటు అందులో లోకేశ్‌ కు బెర్త్ ఖరారైంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా కేబినెట్ స‌మావేశం వివ‌రాల‌ను చంద్ర‌బాబు స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం. రైతులకు మెరుగైన విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్ర‌బాబు తెలిపారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు. వారి ఆర్థిక స్థాయి లేంటి, వారిలో ఎవరి దగ్గర పశువులు ఉన్నాయి అనే డేటా సేకరిస్తున్నామని చంద్ర‌బాబు చెప్పారు. ఈ డేటా సేకరణ వల్ల భవిష్యత్‌లో  కరువును ఎదుర్కోవడంతో పాటు, రైతును ఆదుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. విప‌రీత‌మైన వేడి రీత్యా పగలు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరూ బయటకి రావద్దని చంద్ర‌బాబు సూచించారు. మరీ అత్యవసరమైతే తగిన రక్షణ చర్యలు తీసుకుని బయటకు రావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మొత్తం 7,232 చలివేంద్రాలు పెట్టామని ఆయన చెప్పారు. 6 లక్షలకు పైగా ఓఆర్ ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని ఆయన తెలిపారు.
Tags:    

Similar News