రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికారపక్షం అభ్యర్థులుగా రంగంలోకి నిలవాలని పలువురు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే.. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో బాబు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. రెండు సీట్లకు సంబంధించి ఆయన దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి విషయంలో ఆయన ఓకే అనేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.
టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కోరిన విధంగానే ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీకి ఇచ్చేందుకు బాబు ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. మొదట్లో బీజేపీకి సీటు కేటాయించకూడదని అనుకున్నా.. తర్వాతి పరిణామాల్లో ఆయన ఓకే అనకతప్పలేదని చెబుతున్నారు. అందరూ ఊహించినట్లుగా ఏపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాకుండా.. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ఎంపిక చేయనున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక.. రెండో సీటు కోసం మరో కేంద్రమంత్రి.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరిని మరోమారు రాజ్యసభకు పంపే దిశగా బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో అనుకోని పరిణామం జరిగితే తప్పించి.. ఈ ఇద్దరి అభ్యర్థిత్వానికి సంబంధించిన బాబు ఓకే చేసినట్లేనని.. అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉందని చెప్పొచ్చు.