ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. తొలి రోజు కంటే తీవ్ర స్థాయిలో అధికార - ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపణలు - ప్రత్యారోపణలతో శాసన సభను వేడెక్కించారు. రాజధాని వ్యవహారంలో కొన్ని రోజులుగా సాక్షి పత్రికలో వస్తున్న కథనాలను ఉటంకిస్తూ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు అండ్ కో మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు నారాయణ - ప్రత్తిపాటి పుల్లారావు బినామీ పేర్లతో భూములు కొన్నారని.. చంద్రబాబు రాజధాని విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరించారని జగన్ ఆరోపించారు. ముందు నాగార్జున యూనివర్శిటీ దగ్గర రాజధాని వస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయించి.. ఆ సమయంలో తక్కువ ధరకు అమరావతిలో తన బినామీలతో భూములు కొనిపించారని జగన్ అన్నారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. జగన్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఊరుకోనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు నారాయణ - పుల్లారావు మీద జగన్ ఆరోపణలు చేస్తున్నారని.. ఇప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో వాళ్లు బినామీల ద్వారా భూములు కొన్నట్లు నిరూపిస్తే వాళ్లిద్దరినీ డిస్మిస్ చేస్తానని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరారు. సర్వే నంబర్లు ఇచ్చి.. వాళ్ల బినామీలెవరో రుజువు చేయాలని చంద్రబాబు అన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుని.. 24 గంటలూ కోర్టుల చుట్టూ తిరిగే జగన్ తమ మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజధాని విషయంలో జగన్ దుష్ప్రచారం చేయిస్తున్నాడన్నారు. సాక్షి పత్రికే అవినీతితో పుట్టిందని.. దాన్ని పెట్టింది ప్రజల ఆస్తితో కాబట్టి.. కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు అనడం విశేషం.