అంతా తూచ్ః ఢిల్లీకి బాబు

Update: 2016-08-02 16:08 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా ప‌రిణామాల్లో మ‌రో కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకుంది. పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీల వ‌రుస నిర‌స‌న‌లు - రాష్ట్రంలో ఆందోళ‌నల నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఈ నెల 4న చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక‌వైపు కృష్ణా పుష్క‌రాల‌కు ఆహ్వానం అనే వార్త‌లు వినిపిస్తుండ‌గా...మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడీతో స‌మావేశం అయ్యేందుకు సిద్ద‌మ‌వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసి, పార్లమెంటులో సైతం పార్టీ ఎంపీలు ఆందోళ‌న తెలిపిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ - ప్రధాని మోదీని కలిసి వారిని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ - సుప్రీంకోర్టు సీజే - పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్ర‌ధానితో జ‌రిగే స‌మావేశంలో ఏపీ ప్ర‌త్యేక హోదాపై కేంద్రం వెన‌క్కు త‌గ్గ‌డం - అనంత‌రం ప‌రిణామాలు చ‌ర్చ‌కు రావ‌చ్చున‌ని భావిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీ వెళ్లేది లేద‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తాజాగా ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News