టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు ఎక్కడ లేని కొత్త ఐడియాలు వస్తుంటాయి. దగ్గర దగ్గర పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. తన హయాంలో ఎన్నో నిరసనలు.. మరెన్నో ఆందోళనల్ని చూశారు. మరి.. ఆ సందర్భంగా ఎప్పుడైనా ఒక్కసారి రెఫరెండం లాంటివి నిర్వహించారా? అన్నది ప్రశ్న. తాను అధికారంలో ఉన్నప్పుడు చేయని పనిని.. రాజధాని అమరావతి విషయంలో చేయాలని కోరుకోవటంలో అర్థమేమైనా ఉందా? అన్నది ప్రశ్న.
ఏపీ రాజధానిని మూడు చోట్ల పెట్టాలన్న అంశంపై ఏపీ ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావటమే కాదు.. అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. చంద్రబాబు అండ్ కో మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తుండటం తెలిసిందే. కొందరు రైతులు చేస్తున్న ఆందోళనలు.. నిరసనల్ని బూచిగా చూపిస్తున్న బాబు తన ఎజెండా అమలు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్లుగా చెప్పక తప్పదు.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక అంశం మీద రచ్చ చేయటం ద్వారా.. ప్రశాంతంగా నాలుగు రోజులు పాలన చేయనీకుండా చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. బాబు ఆలోచనలు ఇట్టే అర్థం కాక మానవు. రాజధాని అమరావతి తరలింపుపై రెఫరెండం పెట్టాలని.. అందులో అమరావతి అక్కర్లేదని ఏపీ ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కానీ.. కేంద్రం కానీ ఏ విషయం మీదా రెఫరెండం పెట్టింది లేదు. ఆఖరుకు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు. మరి.. తాను చేయని పనిని జగన్ ప్రభుత్వం చేయాలని చెప్పటం.. అదే పనిగా డిమాండ్లు చేస్తున్న తీరు చూస్తే.. అర్థమయ్యేది ఒక్కటే.. ఏదోలా ఇష్యూను లైవ్ లో ఉంచాలన్న తపన తప్పించి మరింకేమీ లేదని చెప్పక తప్పదు. తాను చేయని పనిని ఎవరో చేయాలనుకోవటం అత్యాశ కాదా బాబు?