ఏపీ రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా అయినా భూముల్ని సేకరించాలని ఏపీ సర్కారు నిర్ణయించటం.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీన్ లోకి రావటం.. ఆయనే తమకు న్యాయం చేయాలంటూ రాజధాని రైతులు పెద్దఎత్తున కోరటం.. చివరకు ఆయన రంగ ప్రవేశం చేసి.. భూసేకరణను నిలిపివేసేలా చేశారన్నది తెలిసిందే.
భూసేకరణకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతులతో మాట్లాడే ఈ సంద్భరంగా పవన్ కల్యాణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తన మద్ధతు కోరిన చంద్రబాబును తాను కొన్ని ప్రశ్నలు వేశానని.. అందులో ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి సంగతేమిటని ప్రశ్నించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి అప్పట్లో చంద్రబాబు బదులిస్తూ.. ఒక్క ఎకరం కూడా రైతుల నుంచి సేకరించకుండా.. రాజధాని నిర్మాణం చేపడతానని చెప్పినట్లుగా చెప్పారు.
రాజధాని నిర్మాణానికి రైతులకు సంబంధించిన ఎకరం భూమి కూడా అవసరం లేదని.. అటవీశాఖకు చెందిన భూమి భారీగా ఉందని.. దాన్ని కేంద్రం అనుమతితో..డీ నోటిఫై చేయించి.. రాజధాని నిర్మాణం చేపడతానని చెప్పారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ చెప్పే వరకు.. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎన్నికల ముందు.. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లు ప్రజలకు తెలీవనే చెప్పొచ్చు.
కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి గురించి అస్సలు ప్రస్తావించని చంద్రబాబు.. రైతుల నుంచి భూమిని సమీకరించే అంశాన్నే ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ రాజధానికి దగ్గర్లో ఉన్న 50వేల అటవీ భూమికి సంబంధించిన వివరాల్ని వెల్లడించి.. వాటిని కూడా రాజధాని నిర్మాణం కోసం వినియోగిస్తామని చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఇప్పటివరకూ ఏపీ రాజధానిని 33వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. తాజాగా మరో 50వేల ఎకరాలు అవసరమని.. ఇందుకోసం అటవీ భూమిని డీ నోటిఫై చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ తెరపైకి రాని అటవీ భూమి ఇప్పుడు రావటం విశేషం. అంటే.. ఎన్నికల నాటి ప్లాన్ కి ఇప్పటి ప్లాన్ కు మధ్య వ్యత్యాసం భారీగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకూ చెప్పినట్లుగా రాజధాని నిర్మాణం 33 వేల ఎకరాల్లోనే కాదు.. అటవీశాఖ 50వేల ఎకరాలతోకలిపితే.. మొత్తం 83వేల ఎకరాలు అవుతుంది. రాజధాని నిర్మాణానికి ఇంత భారీ భూమి అవసరం ఉంటుందా అన్న చర్చ మళ్లీ షురూ అవుతుందేమో.