మోడీ కాకుంటే బీజేపీ ప్ర‌ధానులు వారేనా?

Update: 2019-05-15 04:27 GMT
ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌టం తెలిసిందే.  పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు అవ‌కాశాలు లేకున్నా..  మీటింగ్ జ‌ర‌గ‌క‌పోతే.. ఏదో ఉత్పాతం ముంచుకొస్తుంద‌న్న‌ట్లుగా మాట‌లు చెప్పి అనుమ‌తి తీసుకున్నా. మ‌రింత హ‌డావుడి చేసి ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించిన బాబు బ్యాచ్.. వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

జాతీయ రాజ‌కీయాల‌పై త‌మకున్న అంచ‌నాల్ని వినిపించిన తెలుగు త‌మ్ముళ్ల మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. బీజేపీకి సీట్లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని.. మోడీని ప్ర‌ధానిగా ప్రాంతీయ పార్టీలు అంగీక‌రించే అవ‌కాశం లేదంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే ప్ర‌ధానిగా గ‌డ్క‌రీ.. రాజ్ నాథ్ సింగ్ లాంటివారు ప్ర‌ధాన‌మంత్రులుగా పేర్లు తెర మీద‌కు రావొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం.

మంత్రుల మాట‌లు ఇలా ఉంటే.. మోడీ అంటేనే ఆగ్ర‌హంతో ఊగిపోతున్న చంద్ర‌బాబు.. సోష‌ల్ మీడియాలో మోడీపై వ‌స్తున్న నెగిటివ్ వ్యాఖ్య‌ల్ని ఉటంకించారు. మోడీ అన్ని అబ‌ద్ధాలే చెబుతున్నార‌ని.. ఆయ‌న వైఫ‌ల్యాల మీద చ‌ర్చ న‌డుస్తున్న‌ట్లుగా చెప్పారు. ఓప‌క్క యూపీఏకు మ‌ద్ద‌తు ఇస్తూనే.. మ‌రోవైపు బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాల‌పై చ‌ర్చ జ‌ర‌ప‌టం ఒక ఎత్తు అయితే.. బీజేపీ ప‌వ‌ర్లోకి వ‌స్తే.. ప్ర‌ధానిగా ఎవ‌రుంటార‌న్న అంశంపై సాగిన చ‌ర్చ చూస్తే.. కేబినెట్ మీటింగ్ ప్ర‌జా అంశాల కంటే పార్టీ ఎజెండానే ముఖ్య‌మ‌న్న భావ‌న క‌లిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీని వ్య‌తిరేకించే బాబు బ్యాచ్.. మోడీ కాకుండా ప్ర‌ధాన‌మంత్రి రేసులో ఎవ‌రుంటార‌న్న అంశంపై సాగించిన చ‌ర్చ అన‌వ‌స‌ర‌మైంద‌న్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన‌వ‌స‌ర అంచ‌నాలు వ్య‌క్తం చేసే క‌న్నా.. మౌనంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరును ఫాలో కావాల్సిన చంద్ర‌బాబు.. అందుకు భిన్నంగా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్న మాట‌లు.. రానున్న రోజుల్లో పెద్ద త‌ల‌నొప్పిగా మారే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.
Tags:    

Similar News