ఏపీ ప్రత్యేక హోదా అంశం లెక్కలు తేల్చుకునేందుకు తమ అధినేత ఢిల్లీకి వెళ్లినట్లుగా చెప్పుకుంటున్నారు ఏపీ తెలుగుదేశం నేతలు. వారి మాటల్లో కనిపించినంత ఫోర్స్ చేతల్లో ఉందా? అంటే లేదనే చెప్పాలి. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. హోదా విషయంలో కేంద్రాన్నినిలదీసే తీరుతో కాకుండా.. మాటలతో కన్వీన్స్ చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ప్రత్యేక హోదా అంశం ఏపీలో ఒక సెంటిమెంట్ గా మారిందని.. ఈ విషయం మీద రాజీ పడని పక్షంలో ఇరువురికి రాజకీయంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న మాటల్ని చెప్పటంతో పాటు.. ప్రత్యేక హోదా విషయంలో తన మాట వినాలని జైట్లీని చంద్రబాబు కోరినట్లు చెబుతున్నారు. డిమాండ్ చేసినట్లు కాకుండా.. ఇష్యూ సెంటిమెంట్ రూపంలోకి వెళ్లినందున కేంద్రం ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా జైట్లీతో చంద్రబాబు ఒక కీలక వ్యాఖ్య చేసినట్లుగా తెలుగుదేశం వర్గాలు వెల్లడిస్తున్నాయి.
‘‘ఈ ఒక్కసారి ప్రత్యేకహోదా విషయంలో మీరు నాకు సహకరించండి. దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాను. దేశానికి వాటి ఫలాలు అందించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ప్రజల్ని నన్ను నమ్ముతున్నారు. అందుకే వారు ఓపిగ్గా ఉన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా నష్టం భారీగా వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని జైట్లీతో చంద్రబాబు చెప్పినట్లుగా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు పట్టుపట్టిన వైనం జైట్లీ ఆలోచనల్లో పడేసినట్లుగా తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయం చేయటానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పిన జైట్లీతో.. సాయం కంటే హోదా ప్రకటనతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం. మరి.. బాబు మాటలు జైట్లీ మీద ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాలి.