ఏఐ మాయ... బికినీలో పెళ్లి చేసుకున్న వధువు!

అవును... దేశం ఏదైనా, సంస్కృతి మరేదైనా.. వివాహ సమయంలో, వేదికపై బికినీలో వధువు కనిపించడం అనేది ఆల్ మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి!

Update: 2024-11-30 06:42 GMT

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించబడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఏది నిజం, మరేది అబద్ధం అనే విషయాలపై స్పష్టత కోసం "ఫ్యాక్ట్ చెక్" చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా బికినీ ధరించిన వధువు పిక్ వైరల్ గా మారింది.

అవును... దేశం ఏదైనా, సంస్కృతి మరేదైనా.. వివాహ సమయంలో, వేదికపై బికినీలో వధువు కనిపించడం అనేది ఆల్ మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి! ఈ క్రమంలో భారతీయ సంప్రదాయంలో జరిగినట్లు కనిపిస్తోన్న ఓ వివాహ వేడుకలో వరుడు నిండుగా దుస్తుల్లో కనిపించగా.. అక్కడ వధువు మాత్రం బికినీలో దర్శనమిచ్చింది.

సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న ఈ ఫోటోలో ఒక మహిళ తన పెళ్లి కొసం బికినీని ధరించింది. వరుడు షెర్వాణీ ధరించి ఉండగా.. ఆమె మాత్రం బికినీ ధరించి చేతిలో మాల పట్టుకుని ఉంది. కాళ్లకు, చేతులకూ మెహందీ వేసుకుని ఉంది. అయితే... దీనిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అప్లై చేయగా.. అది రెడిస్ట్ పోస్టుకు మళ్లించిందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... ప్రారంభంలో "దేశీ అడల్ట్ ఫ్యూజన్" కమ్యునిటీలో "మ్యారేజ్ సీజన్" అనే క్యాప్షన్ తో ఇది పోస్ట్ చేయబడింది. ఇదే సమయంలో... ఇది 18ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వీక్షకుల కోసం ఉద్దేశించిన స్పష్టమైన కంటెంట్ ను కలిగి ఉన్నట్లు సూచిస్తుంది. ఇది ఏఐ పిక్ అని క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

సంప్రదాయం నుంచి సమకాలీన వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సృష్టించబడిన అన్ని రకాల కళలను తమ సొసైటీ స్వాగతిస్తుందని.. మీ మీ ప్రత్యేకమైన క్రియేషన్స్ లు తమతో పంచుకోండని ఈ పేజీ స్వాగతిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News