దోమలను దోమలతోనే చంపించే కొత్త ప్రయోగం... వీర్యమే ఆయుధం!
వివరాళ్లోకి వెళ్తే... ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఆడ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.
దోమలు ఎక్కడైతే ఎక్కువగా వ్యాపించి ఉంటాయో.. అక్కడ వ్యాధులు ఎక్కువగా సోకుతాయని, వ్యాపిస్తాయని చెబుతారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా.. మురికి కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌండర్ చల్లడం, మందు స్ప్రే చేయడం చేస్తుంటారు.
అవేమో.. అరచేతిని అడ్డుపెట్టి సముద్రాన్ని ఆపలేరన్నట్లుగా వృద్ధి చెందుతుంటాయని అంటారు. ఈ సమయంలో... ఇలా బ్లీచింగ్ పౌడర్ చల్లో, పురుగు మందులు కొట్టో దోమలను అరికట్టడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని బలంగా భావించారో ఏమో కానీ... ముల్లును ముల్లుతోనే తీయాలని ఫిక్సయ్యారంట శాస్త్రవేత్తలు.
అవును... దోమలను అరికట్టడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ప్లాన్ చేశారని అంటున్నారు. దోమలతోనే దోమలను మట్టుపెట్టాలనే సరికొత్త ఆలోచన చేశారని చెబుతున్నారు. ఇందులో భాంగా... వ్యాదులను ఎక్కువగా వ్యాప్తిచేసే ఆడ దోమలను మగ దోమలతో చంపించాలనే ప్రయోగంతో ముందుకు వచ్చారు.
వివరాళ్లోకి వెళ్తే... ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఆడ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు దోమలను దోమలతోనే చంపాలనే సరికొత్త ప్రయోగం చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగా... మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని పరిశోధకులు యోచిస్తున్నారని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పురుగు మందుల్లా.. ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే.. ఈ దోమల సమస్యను నివారించవచ్చని వారు వెల్లడించారు.
ఈ క్రమంలో... ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయోగాలను ఈగల్లో జరిపగా... దీనివల్ల ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారని అంటున్నారు. అయితే... ఈ ప్రయోగం వల్ల మనుషులు, ఇతర జీవులకు ఎలాంటి హానీ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ విషయంలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మాక్వేరీ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త శామ్ బీచ్... ఈ పద్దతి ప్రయోజనకరమైన జాతులకు హాని కలిగించకుండా పురుగు మందుల్లా త్వరగా పని చేయగలదని అన్నారు. దోమలు అడవిలోకి విడుదలైన తర్వాత మాత్రమే విషపూరితమైన వీర్యాన్ని వ్యక్తపరుస్తాయని తెలిపారు!