బాబు ఖ‌ర్చుల లెక్క‌..గుండె చిక్క‌బట్టుకొని చ‌ద‌వండి

Update: 2018-09-29 05:22 GMT
ఖ‌ర్చుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు. పావ‌లా ఖ‌ర్చు అయ్యే చోట పాతిక రూపాయిల ఖ‌ర్చుకు వెనుకాడ‌ని త‌త్త్వం బాబు సొంత‌మ‌ని చెబుతుంటారు. మ‌రీ.. బాబును ఎట‌కారం చేసుకుంటార‌ని మండిప‌డే వారు లేక‌పోలేదు. ఎంత బాబు మీద కోపం ఉంటే మాత్రం.. ఇలా అనేస్తారా?. మా బాబు ఎంత మెత్త‌గా ఉంటే మాత్రం ఇలా అదే ప‌నిగా ఒత్తేస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వాళ్లు ఉంటారు.

అలాంటోళ్ల‌కు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఖ‌ర్చుల లెక్క‌ల్ని చూపిస్తే స‌రిపోతుంది. చిన్న చిన్న విష‌యాల‌కు బాబు పెట్టే భారీ ఖ‌ర్చు.. ఇదంతా కూడా ప్ర‌జాధ‌న‌మేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అన్నింటికి మించి.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న నేత‌.. ఖ‌ర్చుల విష‌యంలో ఎంత ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి?

కానీ.. అందుకు భిన్నంగా చేసే బాబుగారి ఖ‌ర్చు లెక్క వింటే అవాక్కు కావ‌ట‌మే కాదు.. క‌ళ్లు బైర్లు క‌మ్మ‌టం ఖాయం. శంకుస్థాప‌న‌ల‌కు.. ప్రారంభోత్స‌వాల‌కు.. సీఎం హోదాలో హాజ‌ర‌య్యే కార్య‌క్ర‌మాల కోసం బాబుగారి ఖ‌ర్చులు లెక్క వింటే గుండె గుభేల్ మ‌న‌టం ఖాయం.  ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని మెగా ఈవెంట్ త‌ర‌హాలో నిర్వ‌హించ‌టం.. త‌ల‌కు మించిన ఖ‌ర్చును పెట్టుకోవ‌టం.. అదంతా గుదిబండ‌లా మార‌టం జ‌రుగుతోంది.

ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో త‌న కార‌ణంగా జ‌రిగే ఖ‌ర్చుకు ముకుతాడు వేయ‌టం ద్వారా ఆద‌ర్శంగా నిల‌వాల్సిన చంద్ర‌బాబు.. అందుకు భిన్నంగా ఖ‌ర్చును త‌న మాదిరి ఎవ‌రూ చేయ‌ర‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం స‌రికాద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

చంద్ర‌బాబు పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు అయ్యే ఖ‌ర్చు ఎంత భారీగా ఉంటుంద‌న‌టానికి ఉదాహ‌ర‌ణ‌గా కృష్ణా పుష్క‌రాల‌ను చెప్పొచ్చు. ఇక్క‌డ బాబు పుష్క‌ర‌ స్నానం చేయ‌టానికి పెట్టిన ఖ‌ర్చు ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.2.41కోట్లు ఖ‌ర్చు అయ్యింది. దీనికి సంబంధించిన బిల్లులు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఖ‌ర్చు పెట్టిన సంస్థ‌లు.. బ‌కాయిల కోసం కాళ్లు అరిగిపోయేలా అధికార్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఖ‌ర్చుల విష‌యానికి వ‌స్తే.. ఒక్క గుంటూరు జిల్లాలో ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన శంకుస్థాప‌న‌లు.. ప్రారంభోత్స‌వాలు.. స‌ద‌స్సులు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల కోసం చేసిన ఖ‌ర్చు ఎంతో తెలుసా?  అక్ష‌రాల‌.. రూ.18.26 కోట్లు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆ బిల్లుల‌న్నీ పెండింగ్‌ లో ఉండ‌టం. ఎంత హైటెక్ ముఖ్య‌మంత్రి అయితే మాత్రం.. మ‌రీ ఇంతేసి ఖ‌ర్చు చేస్తే ఎలా?

ఏపీ.. పేద రాష్ట్రమ‌న్న విష‌యాన్ని బాబుగారు గుర్తు పెట్టుకోవాల‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఈ ఖ‌ర్చు లెక్క‌లు వినే కొద్దీ హార్ట్ బీట్ అంత‌కంత‌కూ పెరుగుతుందా?  కూల్.. కూల్‌.. అందుకే గుండె దిటువు చేసుకొని మ‌రీ ఈ వార్త‌ను చ‌ద‌వ‌మంది.


Tags:    

Similar News