రాజకీయాల్లో ఉన్న నాయకులకు సింపతీ చాలా పవర్ ఫుల్ ఆయుధం దానిని వాడుకోవడ వస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే నాయకులకు శ్రీరామరక్ష. సింపతీతో స్టేట్లు గెలిచిన నాయకులు చాలా మందే ఉన్నా రు. అసలు రాజకీయాలు అంటేనే బోలెడు సింపతీ. కాకపోతే బాబుకు ఇది పెద్దగా వర్కవుట్ కావడం లేదు. 2003లో లేని సింపతీని ఊహించుకుని నష్టపోయారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పసుపుకుంకుమ అనే సింపతీ రాజకీయాలను చేద్దాం అనుకున్నారు. అయితే, ఆయన ఆశించింది ఏమైందో అందరికీ తెలిసిందే. ఆయన వంగి వంగి దణ్ణాలు పెట్టినా.. ప్రజలు ఎందుకో పట్టించుకోలేదు.
సరే! ఎన్నికల్లో జగన్ హవా - ఆయనపై ప్రజలకు ప్రేమ ఉప్పొంగింది. ఎన్నికల్లో బాబు ఫెయిలయ్యారని అనుకున్నారు. అయితే, ఎన్నికలు ముగిసి ఆరు మాసాలు పూర్తయ్యాయి. ఈ ఆరు మాసాల్లో జగన్ పాలనపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని - టీడీపీకి ఓట్లు వేయకుండా తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు పదే పదే అనేక పర్యటనల్లో చెప్పుకొచ్చారు. అంతర్గత చర్చల్లో అయితే, జగన్ పాలన చూసి.. ప్రజలు జగన్‌కు ఎందుకు ఓట్లేశామా ? అని తలలు బాదుకుంటున్నారని చంద్రబాబు చెప్పిన విషయం కూడా తెలిసిందే.
అయితే, ఇది నిజమనే అనుకుందాం. ఈ ఆరు మాసాల్లోనే జగన్ పై ద్వేషం.. బాబుపై ప్రేమ పుట్టిందని అనుకుందాం. మరి ఇది ప్రస్ఫుటం కావాలి కదా....! కానీ గ్రౌండ్ లెవల్లో అలాంటిదేం లేదు. తాజాగా చంద్రబాబుపై అమరావతిలో రాళ్లు పడ్డాయి. ఆ వెంటనే ఒకటో రెండో చెప్పులు కూడా పడ్డాయి. చంద్రబాబుపై గడిచిన ఆరు మాసాల్లోనే ప్రజల్లో విపరీతమైన అభిమానం పొంగిపోయి ఉంటే - జగన్ ను గెలిపించి తప్పు చేశామని... వైసీపీకి ఓట్లేసి అన్యాయమైపోయామన్న భావన ప్రజల్లో ఉండి ఉంటే.. తాజాగా అమరావతిలో బాబుకు జరిగిన ఘోర అవమానంపై ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నట్టు..? అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.
పోనీ ఇదే విషయంపై పార్టీ నాయకులు ఎందుకు సైలెంట్ అయినట్టు? ఎక్కడైనా ఒక్కరంటే ఒక్క రైనా చంద్రబాబుకు అనుకూలంగా మద్దతుగా ఏ జిల్లాలో అయినా నిరసన చేపట్టారా ? వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాగళం ఎక్కడైనా వినిపించిందా ? `ఇది తప్పు` అని ముక్తసరిగా సరిపెట్టిన వివిధ పార్టీల నాయకులు కూడా బాబుపై జాలి చూపించలేక పోవడం గమనార్హం. సో.. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.. ఆరు మాసాలు గడిచినా.. జగన్ పై ప్రజలకు నమ్మకం చెదరలేదు. బాబు ఇంకా ప్రజల మనసు గెలుచుకోలేకపోయారనేది స్పష్టమవుతోంది.