గడిచిన రెండు.. మూడు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన వార్త కానీ.. ఆయన ఫోటో కానీ గుర్తుందా? ఏదైనా స్టోరీలో భాగంగా ఆయన ఫోటో అచ్చేయొచ్చు కానీ.. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్లు కానీ.. ఆయన తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఉండేలా వార్త కనిపించదు.
చంద్రబాబు ఏంటి? మీడియాలో కనిపించకపోవటం ఏమిటన్న సందేహం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లారు. గత కొద్దిరోజులుగా ఊపిరి సలపనంత పని ఒత్తిడితో ఉన్న చంద్రబాబు.. కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ కు వెళ్లారు. చంద్రబాబు తీరును నిశితంగా గమనిస్తే.. ఆయన ఎక్కడున్నా.. ఏదో ఒక అంశానికి సంబంధించి ఒక్క వార్త అయినా మీడియాలో వస్తుంది. ఇక.. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడైతే ప్రెస్ నోట్లు వరుసగా వస్తుంటాయి.
అయితే.. ఈ ప్రవాహానికి బ్రేకులు పడేది చంద్రబాబు.. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు అందే వ్యవస్థ నిరంతరం పని చేస్తూ ఉంటుంది. కాకుంటే.. ఆయన నుంచి స్పందన అనేదే ఉండదు. సింఫుల్ గా చెప్పాలంటే సమాచారానికి సంబంధించి ఇన్ కమింగ్ మాత్రమే కానీ అవుట్ గోయింగ్ అన్నది ఉండదన్న మాట. ఫ్యామిలీతో గోవాకు వెళ్లిన నేపథ్యంలో ఏపీ సీఎంకు సంబంధించిన ఎలాంటి వార్తలు మీడియాలో రావటం లేదని చెప్పాలి.