ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఉగ్రరూపం దాల్చారు. కొద్దికాలం క్రితం ఉద్యోగుల పనితీరుపై ఆక్రోశం వ్యక్తం చేసిన బాబు తాజాగా రాజధాని రైతులపై అసహనం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం పరిధిలోకి వచ్చే రైతులు గ్రామకంఠాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేందుకు అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు తన అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పారు.
ప్రపంచ స్థాయి రాజధాని కోసం ప్రజాస్వామ్య పద్దతిలో భూములు సేకరించామని చంద్రబాబు తెలిపారు. అమరావతిని మరో చోట నిర్మిస్తే ప్రస్తుతం ఉన్నంత స్థాయిలో భూముల ధరలు పెరిగేవా అంటూ బాబు వ్యాఖ్యానించారు. రైతులకు న్యాయం చేసేలా అమరావతి నిర్మాణం కోసం తాను వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా తాను కృషి చేస్తుండటాన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాజధాని నిర్మాణం ద్వారా లబ్ధి పొందే రైతులు కొంత త్యాగానికి కూడా సిద్ధపడాలని సూచించారు.
మరోవైపు తాజాగా జరిగిన దావోస్ పర్యటన గురించి కూడా చంద్రబాబు వివరించారు. ఇటీవలి కాలంలో ఏపీలో జరిగిన భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి పెట్టుబడులు తెచ్చుకున్నట్లే మరిన్ని పెట్టుబడుల కోసం దావోస్ కోసం వెళ్లానని చంద్రబాబు తెలిపారు. తన దావోస్ పర్యటన సందర్భంగా వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో ఒప్పందాలు కుదిరినట్లు చంద్రబాబు వివరించారు.